Virat Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరుపున రంజి ఆడుతున్నాడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఢిల్లీ జట్టు తరుపున ఆడుతున్నాడు. వాస్తవానికి అతడు మొన్ననే ఒక మ్యాచ్ అడాల్సి ఉండేది. అయితే మెడ నొప్పి కారణంగా ఆ మ్యాచ్ ఆడ లేక పోయాడు. ఇక ఇప్పుడు రైల్వేస్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. జనవరి 30 నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్లో ప్రాక్టీస్ కోసం విరాట్ కోహ్లీ మంగళవారం నుంచి మైదానంలోకి దిగాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లీ రంజీలో ఆడుతున్న నేపథ్యంలో మీడియా, సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
జాతీయ మీడియాలో కథనాల ప్రకారం..
విరాట్ కోహ్లీ జనవరి 30 నుంచి రైల్వేస్ జట్టుతో జరిగే రంజీ మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో నవదీప్ షైనీ, సిద్ధాంత్ శర్మ బౌలింగ్లో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. 2012 తర్వాత తొలి రంజీ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. 25 నిమిషాల ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. ఇందులో ఐదుగురు బౌలర్లు మనీ గ్రేవాల్, నవదీప్ షైనీ, రాహుల్ గేహ్లాట్, సిద్ధాంత్ శర్మ, వివేక్ గుస్సేన్ ను విరాట్ కోహ్లీ ఎదుర్కొన్నాడు. వారి బౌలింగ్లో విరాట్ కోహ్లీ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. అయితే నవదీప్ షైనీ, సిద్ధాంత్ బౌలింగ్లో విరాట్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇక వీరి కంటే ముందు హర్ష్ త్యాగి(ఎడమ చేతివాటం), సుమిత్ మాతూర్(ఎడమ చేతి వాటం), శివం ( కుడి చేయి వాటం) వారి బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు.
త్యాగి పదునైన స్పిన్..
త్యాగి పదునైన స్పిన్ లో విరాట్ రెండుసార్లు అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఆస్ట్రేలియాలో కూడా విరాట్ కోహ్లీ స్థాయిలో ప్రాక్టీస్ చేయలేదు. గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లో లేకపోవడంతో తీవ్రంగా నెట్స్ లో శ్రమించాడు. త్వరలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ధోని సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. రోహిత్, విరాట్ కెరియర్ చరమాంకంలో ఉన్న నేపథ్యంలో.. కచ్చితంగా సిరీస్ గెలవాలని భావిస్తున్నారు. అందువల్లే విరాట్ తన వయసును సైతం లెక్కచేయకుండా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు..