IND vs BAN : బంగ్లాదేశ్ భయపెట్టింది.. అయినా టీమిండియా చమటోడ్చి గెలిచింది..

IND vs BAN : టీ20 క్రికెట్ లో ఏ దేశాన్ని తక్కువగా అంచనావేయవద్దని తాజాగా బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ మ్యాచ్ రుజువు చేసింది. విరాట్ కోహ్లీ 64, కేఎల్ రాహుల్ 50 పరుగుల పుణ్యమాని టీమిండియా 184 పరుగుల అత్యధిక పరుగులు చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ కేవలం 27 బంగుల్లోనే 60 పరుగులు దంచికొట్టి బంగ్లాదేశ్ ను విజయం అంచున నిలిపారు. అయితే అతడికి […]

Written By: NARESH, Updated On : November 2, 2022 6:11 pm
Follow us on

IND vs BAN : టీ20 క్రికెట్ లో ఏ దేశాన్ని తక్కువగా అంచనావేయవద్దని తాజాగా బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ మ్యాచ్ రుజువు చేసింది. విరాట్ కోహ్లీ 64, కేఎల్ రాహుల్ 50 పరుగుల పుణ్యమాని టీమిండియా 184 పరుగుల అత్యధిక పరుగులు చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ కేవలం 27 బంగుల్లోనే 60 పరుగులు దంచికొట్టి బంగ్లాదేశ్ ను విజయం అంచున నిలిపారు. అయితే అతడికి కేఎల్ రాహుల్ రనౌట్ చేయడమే మ్యాచ్ ను మలుపుతిప్పింది. టీమిండియాను రేసులోకి తెచ్చింది. ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడి బంగ్లాదేశ్ ఓడిపోయింది.

7 ఓవర్లకు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. ఆ సమయంలో భారీ వర్షం పడితే మ్యాచ్ రద్దు అయితే రన్ రేట్ పరంగా ఎక్కువ పరుగులు ఉన్న బంగ్లాదేశ్ గెలిచేదే. కానీ వాన తగ్గింది. టీమిండియా పంట పండింది. వర్షం తగ్గాక తడిగా మారిన పిచ్ పై అప్పటివరకూ తేలిపోయి భారీగా పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు సత్తా చాటారు. వెంటవెంటనే వికెట్లు తీసి టీమిండియాను గట్టెక్కించారు.

ముఖ్యంగా హార్ధిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ లు ఒక్కో ఓవర్ లో రెండు వికెట్ల చొప్పున తీసి బంగ్లాదేశ్ ను భయపెట్టారు. అయితే నూరుల్ హుస్సేన్, టస్కిన్ మహ్మద్ లు 6 వికెట్లు పడిపోయినా చెక్కుచెదరకుండా మ్యాచ్ ను చివరి వరకూ నడిపించారు.

6 బంతుల్లో 20 పరుగులు కావాల్సిన దశలో చివరి ఓవర్ బంతిని అందుకున్న అర్షదీప్ సింగ్ అద్భుతమే చేశారు. ఒక సిక్స్ ఇచ్చి భయపెట్టినా చివరకు భారత్ ను గెలిపించి ఊరటనిచ్చారు. టీమిండియాను బ్యాటింగ్ లో కోహ్లీ, రాహుల్ ఆదుకుంటే.. బౌలింగ్ లో అర్షదీప్ అద్భుత బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపుతిప్పాడు.