IND vs AUS : ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ 73, హెడ్ 39, పరుగులు చేశారు. క్యారీ 46*, బెన్ డ్వార్ షిష్ 3* పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.. ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి హెడ్ వికెట్ తీసిన విధానం హైలెట్ గా నిలిచింది.. వరుణ్ చక్రవర్తి వేసిన 8వ ఓవర్ రెండో బంతికి హెడ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. గిల్ అద్భుతంగా బంతిని అందుకోవడంతో హెడ్ నిరాశతో వెను తిరిగాడు. దీంతో ఒక్కసారిగా భారత్ ఊపిరి పీల్చుకుంది.. స్మిత్, క్యారీ హాఫ్ సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోర్ దిశగా ప్రయాణం సాగిస్తోంది. ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ ను పదేపదే ప్రయోగిస్తున్నాడు.
Also Read : మన బౌలర్లు భళా.. దుబాయ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన టార్గెట్ ఎంతంటే?
డాన్స్ చేసిన విరాట్
ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానం లో డ్యాన్స్ చేశాడు. అదిరిపోయి స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు. నెట్టింట వైరల్ గా మారింది. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ ఒక్కసారిగా ఏదో పూనకం వచ్చినట్టు డాన్స్ చేశాడు. అంతేకాదు సహచరులను కూడా డ్యాన్స్ చేయాలి అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ మైదానంలో డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు.. తోటి ఆటగాళ్ళను ఆట పట్టించడం.. వారితో సరదాగా సంభాషించడం.. వారిని అనుకరించడం వంటివి చేస్తూ ఉంటాడు. అందువల్లే టీమిండియా కు స్ట్రెస్ బస్టర్ గా విరాట్ కోహ్లీని చెబుతుంటారు. మైదానంలో ఆగ్రహాన్ని, చాకచకాన్ని, లౌక్యాన్ని ప్రదర్శించడంలో విరాట్ కోహ్లీ ముందుంటాడు. ఇక ఇటీవల టీమిండియా మేనేజ్మెంట్ నిబంధనలు కఠినం చేయడంతో ప్రత్యేకంగా చెఫ్ లను నియమించుకునే అవకాశం టీమిండియా ఆటగాళ్లకు లేకుండా పోయింది. దీంతో విరాట్ కోహ్లీ ఇటీవల ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించుకుని తిన్నాడు. ఆ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. “విరాట్ స్టార్ ఆటగాడు మాత్రమే కాదు.. అద్భుతమైన డ్యాన్సర్ కూడా. అతడి డ్యాన్స్ మామూలుగా లేదు. క్రికెటర్ కాకుండా ఉండి ఉంటే.. విరాట్ ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయి ఉండేవాడు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తగ్గకుండా స్టెప్పులు వేస్తున్నాడు. మైదానాన్ని తన స్టెప్పులతో అలరిస్తున్నాడని” అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : రెండుసార్లు తప్పించుకున్నాడు.. చివరికి వరుణ్ చక్రవర్తి “హెడ్” ఏక్ తొలగించాడు.. ఏకంగా నేషనల్ హీరో అయిపోయాడు..
Virat Kohli doing Bhangda. ❤️ https://t.co/Q3p3fqGJpu
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025