IND vs AUS : చెప్పులో రాయి.. చెవిలో జోరీగ ఇలా ఇబ్బంది పెడతాయో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే శతకారుడు దీనిపై ఒక పద్యమే రాశాడు.. ఇక ఇలాంటి అవాంతరమే చెన్నైలోని చేపాక్ మైదానంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఎదురైంది. దీంతో మైదానం సెక్యూరిటీ గార్డ్ లకు చుక్కలు కనిపించాయి..
మూడో వన్డేలో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ కొనసాగుతుండగానే.. మైదానంలో అనుకోని అవాంతరం ఏర్పడింది.. దీంతో ఆటకు బ్రేక్ పడింది. సెక్యూరిటీ సిబ్బంది పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇంతకీ ఆ అవాంతరమేంటంటే.. చేపాక్ మైదానంలోకి దూసుకు వచ్చిన ఓ గ్రామ సింహం.. దీనివల్ల ఆట కొద్దిసేపు ఆగిపోయింది.. దానిని బయటకు వెళ్ళగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ప్రయాసలు పడ్డారు. ఆ సెక్యూరిటీ సిబ్బందిని ఆ గ్రామ సింహం మైదానం మొత్తం పరిగెత్తించింది. చివరకు ఆ గ్రామ సింహం మైదానం వీడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ సెక్యూరిటీ గాడ్స్ ను పరిగెత్తించిన ఆ గ్రామ సింహం అందరినీ నవ్వించింది.. కామెంట్రేటర్లైతే ” మైదానంలోకి పిలవకుండా ఒక అతిధి వచ్చిందంటూ” చలోక్తి విసిరారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 43వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతి వేసే ముందు గ్రామ సింహం మైదానంలోకి ప్రవేశించింది. ఆ కుక్కతో రవీంద్ర జడేజా కాసేపు ఆడుకున్నాడు. దాన్ని పట్టుకుంటున్నట్టు సైగలు చేసి భయపెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులు కూడా కొంతగా కామెంట్లు చేస్తున్నారు. ” పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మైదానంలోకి వచ్చాడని” ఒకరు అంటే… మ్యాచ్ ఫిక్స్ చేసేందుకు ఆ శునకాన్ని పంపించారని మరికొందరు వ్యాఖ్యానించారు. మనుషులేనా.. కుక్కలు క్రికెట్ చూడొద్దా.. మరికొందరు కామెంట్స్ చేశారు.
మైదానం మొత్తం భారీ భద్రత ఉన్న నేపథ్యంలో ఆ గ్రామ సింహం ఎలా వచ్చిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆల్ అవుట్ అయింది. హెడ్ 33, మార్ష్ 47, క్యారీ 38 టాప్ స్కోరర్ లు గా నిలిచారు. పాండ్యా 3/44, కుల దీప్ యాదవ్ 3/56, అక్షర్ 2/57, సిరాజ్ 2/37 వికెట్లు తీశారు.
Lots of noise at #Chepauk during the cricket match.
And, some naai-s too.
A dog disrupts play at the #INDvsAUS match in #Chennai. pic.twitter.com/jtLRkZMYGj
— Srinivasa Ramanujam (@srinivasjam) March 22, 2023