Ind Vs Aus Semi Final: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ – బీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఏకంగా 350 కి పైగా పరుగులు చేసింది. అ టార్గెట్ చేజ్ చేయడం సాధ్యం కాదని ముందుగానే ఇంగ్లాండ్ ఒక అంచనాకు వచ్చింది. ఆస్ట్రేలియాను తప్పుడు అంచనా వేసింది. ఇంకేముంది ఆస్ట్రేలియా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగింది. సీన్ కట్ చేస్తే భారీ స్కోరును చేదించి సరికొత్త రికార్డు సృష్టించింది ఆస్ట్రేలియా.
Also Read: బాలయ్య “కంగారు” రివేంజ్.. ట్రోలింగ్ అదిరిపోలా…
ఇంగ్లాండ్ జట్టుపై ఆడినట్టుగానే టీమిండియా పై కూడా ఆడాలని ఆస్ట్రేలియా అనుకుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ పై మాత్రమే ఆస్ట్రేలియా ఆడింది. మిగతా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ లపై పూర్తిస్థాయిలో మ్యాచ్ లు ఆడే అవకాశం ఆస్ట్రేలియా కు లభించలేదు. దీనికి కారణం వర్షాల వల్ల మ్యాచులు రద్దు కావడమే. ఇంగ్లాండ్ పై సాధించిన విజయం ద్వారా సెమీ ఫైనల్ వచ్చిన ఆస్ట్రేలియా.. భారత జట్టుకు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మాదిరిగానే దమ్కీ ఇద్దామని భావించింది. కానీ కీలక ఆటగాళ్లు లేకపోవడంతో ఆస్ట్రేలియా ఒక అడుగు వెనక్కి వేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ తనదైన చాకచక్యంతో భారత జట్టును మట్టికరిపించాలని భావించాడు. ఇందులో భాగంగానే సరికొత్త ప్రణాళికలు అమలు చేశాడు. కానీ ఇక్కడ అతడు అసలు విషయం మర్చిపోయాడు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు పేస్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. అని ఇటీవల కాలంలో స్పిన్ బౌలింగ్లో ఇబ్బంది పడుతున్నారు. అయితే దాని నుంచి అధిగమించడానికి దుబాయ్ లో కొద్ది రోజులుగా టీమిండియా ఆటగాళ్లు స్పిన్ బౌలర్లతో బౌలింగ్ వేయించుకొని సాధన చేశారు. దానివల్ల ఆస్ట్రేలియాపై దూకుడుగా బ్యాటింగ్ చేశారు.. కొన్ని సందర్భాల్లో తడబడినప్పటికీ.. మిగతా అన్నిసార్లు పై చేయి సాధించారు. తద్వారా దుబాయ్ మైదానంపై వరుసగా నాలుగో విజయం సాధించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై చేజింగ్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ జట్టుపై ముందుగా బ్యాటింగ్ చేసే విజయం సాధించారు.
దింపుడు కల్లం ఆశ
ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆశ అధికంగా ఉంటుంది. అందువల్లే వారు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తారు. సమర్థవంతంగా బౌలింగ్ చేస్తారు. ఫీల్డింగ్ విషయంలోనూ అదే దూకుడు కొనసాగిస్తారు. ఇక టీమిండియా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులు అదే సమీకరణాన్ని ప్రయోగించాలని కెప్టెన్ భావించాడు. ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని యోచించాడు. ఇందులో భాగంగానే ఏడుగురు బౌలర్ తో బౌలింగ్ చేయించాడు. డ్వార్ షిస్, ఎల్లీస్, హెడ్, మాక్స్ వెల్, ఆడమ్ జంపా, తన్విర్ సంఘా, కూపర్ కన్నోల్లీ లతో బౌలింగ్ చేయించాడు. అయితే వీరిలో జంప, ఎల్లిస్ చెరి రెండు వికెట్లు సాధించారు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. “వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా ఎదుట 265 పరుగుల స్కోర్ ఏం ఆనుతుంది? ఆ స్కోరును ఆస్ట్రేలియా ఎలా నిలబెట్టుకుంటుంది. ఇంతమంది బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. అందువల్లే స్మిత్ ఆలోచనలు మొత్తం దింపుడు కల్లం ఆశల మాదిరిగానే ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టుపై గెలిచినట్టు భారత్ పై గెలవాలి అని అనుకోవడమే స్మిత్ చేసిన తొలి తప్పు అని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.