IND vs AUS : రెండు జట్లు కూడా బలంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో భారత వరుసగా 10 విజయాలు సాధించింది. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.. దీంతో కోట్లాది భారతీయ అభిమానులు షాక్ కు గురయ్యారు.. 2015 వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో, 2003 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ భారత జట్టును ఆస్ట్రేలియా ఇంటికి పంపించింది. అందువల్లే ఆస్ట్రేలియా జట్టు ఎదురుపడితే భారత అభిమానులు అమ్మో అనే పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రస్తా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో టాప్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇటీవల లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 350 కి పైగా పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సులువుగానే ఛేదించింది.. హెడ్, స్మిత్ లాంటి ఆటగాళ్లు విఫలమైనప్పటికీ మిగతా ప్లేయర్లు దూకుడుగా ఆడారు.
స్పిన్నర్లదే కీలక భూమిక
ఛాంపియన్స్ ట్రోఫీకి ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేస్తే చాలామంది విమర్శించారు. కానీ ఇప్పుడు స్పిన్ బౌలర్లే భారత జట్టుకు ఆయుధంగా మారారు. భారత జట్టు తొలి రెండు మ్యాచ్లలో చేజింగ్ చేసి గెలిచింది. మూడో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినప్పటికీ గొప్ప స్కోరు చేయలేకపోయింది. తక్కువ స్కోరు అయినప్పటికీ నలుగురు స్పిన్నర్లు చుక్కలు చూపించారు. 39 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన స్పిన్ బౌలర్లు 128 డాట్ బాల్స్ వేశారంటే.. వారి బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుతోను నలుగురు స్పిన్ బౌలర్లను ఉపయోగించాలని భారత జట్టు భావిస్తోంది. న్యూజిలాండ్ దట్టితో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తిని.. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో కొనసాగిస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది..షమీ కి తోడుగా హర్షిత్, అర్ష్ దీప్ సింగ్ లలో ఎవరో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో రోహిత్, గిల్, విరాట్, అయ్యర్, అక్షర్, రాహుల్ రూపంలో టాప్, మిడిల్ ఆర్డర్లు బలంగా ఉన్నాయి. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు.
Also Read : బ్యాటింగ్ కు వచ్చినా.. బౌలింగ్ కు రాని బుమ్రా.. అభిమానుల్లో ఆందోళన!
కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ..
ఇక ఆశలు ఏ విషయానికి వస్తే కమిన్స్, హేజిల్ వుడ్, స్టార్ క్లాంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఆస్ట్రేలియా మెగా టోర్నికి వచ్చింది. దీంతో జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అందువల్లే ఇంగ్లాండ్ 351, ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగులు చేయగలిగాయి. బౌలింగ్ బలహీనంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ మాత్రం బలంగా కనిపిస్తోంది.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో 351 పరుగులను ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలోనే చేదించింది. ఇక ప్రస్తుత టోర్నీలో ఆస్ట్రేలియా పూర్తి మ్యాచ్ ఆడింది ఇంగ్లాండ్ పై మాత్రమే. ఇక వర్షం వల్ల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఆస్ట్రేలియాకు సరైన ప్రాక్టీస్ లేకుండా పోయింది. హెడ్ తో భారత జట్టు ఎప్పుడూ ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉంటుంది. స్మిత్, క్యారీ, ఇంగ్లిస్, మాక్స్ వెల్ తో ప్రమాదం పొంచే ఉంది. అయితే మాథ్యూ షార్ట్ దూరం కావడంతో జంపాకు తోడుగా మరో స్పిన్నర్ లేకుండా పోయాడు. అతడి స్థానంలో కూపర్ కన్నోలిని తీసుకున్నారు. మాక్స్ వెల్, హెడ్ పార్ట్ టైం స్పిన్నర్లుగా జట్టుకు సేవలందిస్తారు. ప్రధాన పేస్ బౌలర్లు డార్విష్, ఎల్లిస్, జాన్సన్ భారత జట్టుపై కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడారు.
మైదానం ఎలా ఉందంటే..
దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి.. వికెట్ మొత్తం స్పిన్ బౌలర్లకు అనుకూలించనుంది. మంచు ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. దీంతో టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది.
Also Read : స్కానింగ్ లో ఏం తేలింది? బుమ్రా రేపటి మ్యాచ్లో ఆడతాడా? టీమిండియా మేనేజ్మెంట్ క్లారిటీ