ind vs aus : ఆస్ట్రేలియాపై భారత్ నాలుగు పరుగుల స్వల్ప లీడ్ సాధించింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 157 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రిషబ్ పంత్ 61, జైస్వాల్ 22 పరుగులు చేశారు.. బోలాండ్ 6 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ 4 పరుగులు కలుపుకొని టీమ్ ఇండియా ఆస్ట్రేలియా ఎదుట 162 పరుగుల లక్ష్యాన్ని విధించింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. కోన్ స్టాస్ 22, ఖవాజా 19* పరుగులు చేశారు. ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఖవాజా, హెడ్ 5* క్రీజ్ లో ఉన్నారు.
బుమ్రా బౌలింగ్ వేయలేదు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సమయంలో బుమ్రా (Jasprit Bumrah) గాయపడ్డాడు. అతడి వెంటనే మైదానం నుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. స్కానింగ్ వెళ్లిన అనంతరం బుమ్రా పరుగులు తీసుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వెళ్ళాడు.. స్కానింగ్ అనంతరం బుమ్రా స్వల్పకాలిక నడుము నొప్పితో బాధపడుతున్నాడని తేలింది. ఆ తర్వాత టీమ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో బుమ్రా బ్యాటింగ్ కు వచ్చాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు బోలాండ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గోల్డెన్ డక్ గా అతడు వెనుతిరిగాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభమైన సమయంలో బుమ్రా బౌలింగ్ కు రాలేదు. కేవలం మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ మాత్రమే బౌలింగ్ చేశారు. ప్రసిద్ద్ మూడు వికెట్లు పడగొట్టినప్పటికీ.. సిరాజ్ మాత్రం ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. బుమ్రా బౌలింగ్ చేసి ఉంటే ఆస్ట్రేలియా పరిస్థితి మరో విధంగా ఉండేదని.. అతడు బౌలింగ్ లోకి రాకపోవడంతో పరిస్థితి టీమిండియా కు వ్యతిరేకంగా మారుతోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బుమ్రా బౌలింగ్ చేస్తాడా? లంచ్ బ్రేక్ తర్వాత అయినా మైదానంలోకి వస్తాడా? అనే విషయాలపై బీసీసీఐ మరి కొద్ది క్షణాల్లో క్లారిటీ ఇవ్వనుంది. టీం ఇండియాకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యం. ఇందులో గెలిస్తేనే వరల్డ్ బెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్తుంది. అలా జరగాలంటే కచ్చితంగా బుమ్రా బౌలింగ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రమాదకరమైన ఉస్మాన్ ఖావాజా, హెడ్ క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరే కాకుండా.. మిగతా వారిని కూడా అవుట్ చేస్తేనే టీమ్ ఇండియాకు గెలుపు లభించే అవకాశం ఉంది. లేనిపక్షంలో ఓటమి ఎదురయ్యే ప్రమాదం ఉంది.
Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc
— cricket.com.au (@cricketcomau) January 4, 2025