IND vs AUS: ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేదు. కూపర్ కన్నోలీ(0) గోల్డెన్ డక్ గా షమీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్మిత్ (73), హెడ్(39), క్యారీ(61) పరుగులతో ఆకట్టుకున్నారు. రెండో వికెట్ కు 50, మూడో వికెట్ కు 56, నాలుగో వికెట్ కు 34, ఐదవ వికెట్ కు 54, ఏడో వికెట్ కు 34 పరుగుల భాగస్వామ్యాన్ని ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పడంతో ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. మొత్తంగా 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత్ ఎదుట 265 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
Also Read : రోహిత్.. నువ్వు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే కుదరదు.. చివరి వరకు ఆడాలి..
అదరగొట్టిన బౌలర్లు
దుబాయ్ మైదానంపై టీమ్ ఇండియా బౌలర్లు అదరగొట్టారు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో స్పిన్నర్లు హవా చూపించగా.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత పేస్, స్పిన్ బౌలర్లు సమష్టిగా రాణించారు. మహమ్మద్ షమీ మూడు వికెట్లు సాధించాడు.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరి రెండు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. దుబాయ్ మైదానంలో భారత బౌలర్లు ఆస్ట్రేలియానే తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఒక దశలో ఆస్ట్రేలియా 280 కి పైగా పరుగులు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే స్మిత్, మాక్స్ వెల్ ను వెంట వెంటనే అవుట్ చేయడంతో భారత్ మ్యాచ్ పై పట్టు బిగించింది. క్యారీ మాత్రం మరో ఎండ్ లో గట్టిగా నిలబడ్డాడు. 57 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 61 పరుగులు చేశాడు. అందువల్లే ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో కొన్ని క్యాచులను భారత బౌలర్లు జారవిడిచారు. ముఖ్యంగా షమీ స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను అందుకోలేకపోయాడు. దీంతో జీవదానం పొందిన స్మిత్ అదరగొట్టాడు. బలమైన ఇన్నింగ్స్ ఆడి.. ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోరు సాధించేలా చేశాడు. మరోవైపు హెడ్ కూడా క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. రన్ అవుట్ నుంచి కూడా తప్పించుకున్నాడు. చివరికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో గిల్ చేతికి చిక్కాడు. మాక్స్ వెల్ కూడా అక్షర్ పటేల్ వేసిన బంతిని సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత అద్భుతమైన డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్మిత్ కూడా మహమ్మద్ షమీ వేసిన ఫుల్ టాస్ బంతిని అంచనా వేయలేక ముందుకు వచ్చి ఆడాడు. కానీ బంతి మిస్ అవ్వడంతో అది వికెట్లను పడగొట్టింది.
Also Read : భారత్ తో ఫైనల్ ఫైట్.. సౌతాఫ్రికాకే ఛాన్స్.. టీ20 వరల్డ్ కప్ రిపీట్ అవుద్దా?