IND Vs AUS: ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ బ్రిస్బేన్ లో శనివారం జరగనుంది.. ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న ఈ సిరీస్లో టీమిండియా వరుసగా రెండు విజయాలు సాధించి పై చేయి కొనసాగిస్తోంది.. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. మూడు, నాలుగు మ్యాచ్ లలో టీమిండియా విజయాలు అందుకుంది.
Also Read: బలగం వేణు ఏడ్చేశాడు.. నేను ఒకటే మాట చెప్పాను.. తేజ బయటపెట్టిన నిజం…
2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో టీమిండియా ఇప్పటివరకు నాలుగు వరుస ద్వైపాక్షిక సిరీస్ లు సొంతం చేసుకుంది. ఆసియా కప్ కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో ద్వైపాక్షిక సిరీస్ సొంతం చేసుకోవడానికి రెడీ అయింది.
ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ లో చివరి మ్యాచ్ శనివారం జరుగుతోంది. ఇందులో గనక టీమిండియా గెలిస్తే 3-1 తేడాతో ట్రోఫీ అందుకుంటుంది. ఒకవేళ ఓడిపోయిన సరే సిరీస్ చేజారిపోయే ప్రమాదం మాత్రం ఉండదు. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. హెడ్, హేజిల్ వుడ్ లేని లోటు ఆ జట్టులో కనిపిస్తోంది. మరోవైపు స్వదేశంలో సిరీస్ కోల్పోవద్దని కృత నిశ్చయంతో ఉంది. అందువల్లే ఆ జట్టు అత్యంత పట్టుదలతో కనిపిస్తోంది.. ఆస్ట్రేలియా బౌలర్లకు తగ్గట్టుగానే బ్రిస్బేన్ లోని గాబా మైదానం ఉంటుంది.. ఈ పిచ్ పై రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.. అయితే శనివారం ఆ ప్రాంతంలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది.
లోపాలు వెంటాడుతున్నాయి
టీమిండియా రెండు మ్యాచ్లు గెలిచినప్పటికీ.. బ్యాటింగ్లో లోపాలు వెంటాడుతూనే ఉన్నాయి.. గిల్ ఇంతవరకు తన స్థాయి ప్రదర్శన చేయలేదు. సూర్య కుమార్ యాదవ్ భారీగా పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు. శివం దూబే అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అతడు తన ఆట తీరును పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే పొట్టి ఫార్మాట్లో అతడికి స్థానం స్థిరంగా ఉంటుంది.. అక్షర్ పటేల్ బౌలింగ్లో అదరగొడుతున్నప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.. అభిషేక్ శర్మ మాదిరిగా ఒకరు లేదా ఇద్దరు ప్లేయర్లు గనుక ఆడితే టీమిండియా భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక తిలక్ వర్మ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. వాషింగ్టన్ సుందర్ 4 మ్యాచ్లో తేలిపోయాడు. వీరంతా కూడా గాబా మైదానంలో జరిగే మ్యాచ్ లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో వీరి స్థానాలకు ప్రమాదం పొంచి ఉంది.. వాస్తవానికి ఇప్పటివరకు మూడు మ్యాచ్లు జరిగినప్పటికీ టీమిండియా తన బ్యాటింగ్ స్టైల్ ను అంతగా చూపించలేదు. కేవలం బౌలింగ్ ద్వారా మాత్రమే జట్టు నెట్టుకొస్తుంది. చివరి మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ బాగుపడితే ఇబ్బంది ఉండదు..