Ind Vs Aus 4th Test: ఆస్ట్రేలియా బౌలర్ల జోరు చూస్తుంటే టీమిండియా ఫాలో ఆన్ ఆడక తప్పదని అనిపించింది. అయితే దానిని తప్పు అని నిరూపిస్తూ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలనం సృష్టించాడు. ఈ కథనం రాసే సమయానికి 97 పరుగులు చేశాడు.. 162 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో ఆ పరుగులు చేశాడు.. మరో ఆటగాడు వాషింగ్టన్ సుందర్ (50) తో కలిసి అభేద్యమైన ఎనిమిదో వికెట్ కు 127 పరుగులు జోడించాడు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్ల ఆధిపత్యానికి చెక్ పెట్టాడు.. దీంతో టీం ఇండియా కాస్త లో కాస్త పటిష్ట స్థితికి చేరుకుంది.. ఇదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టులలో 8 లేదా అంతకంటే తక్కువ నంబర్లో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
రవిచంద్రన్ అశ్విన్
ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ 112 బంతులు ఎదుర్కొని 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అశ్విని ఇలా సెంచరీ చేయడం ఆరవది కాగా.. తన సొంతమైదానం చెన్నై వేదికగా రెండవది.. 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో అశ్విన్ బ్యాటింగ్ కు వచ్చి నాలుగు సెంచరీలు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అతడు ఎనిమిదో స్థానంలో 59 మ్యాచ్ లలో బ్యాటింగ్ చేశాడు. 27.40 సగటుతో 1,946 పరుగులు చేశాడు. ఇతడి అత్యధిక టెస్ట్ స్కోర్ 124. అయితే అది కూడా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి నమోదు చేసిందే కావడం విశేషం. మొత్తం మీద అశ్విన్ 101 మ్యాచ్లలో 27+ సగటుతో 3,400 పరుగులు చేశాడు. టెస్టులలో ఓవరాల్ గా ఆర్ సెంచరీలు చేశాడు.
The rising ⭐ of Indian cricket shines bright in the Boxing Day Test with a maiden Test hundred!
Take a bow, #NitishKumarReddy! #AUSvINDOnStar 4th Test, Day 3 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/xsKac0iCju
— Star Sports (@StarSportsIndia) December 28, 2024
డానియల్ వెటోరి
న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు డానియల్ వెటోరి 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఐదు సెంచరీలు చేశాడు. అతడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి నాలుగు సెంచరీలు చేశాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఒక సెంచరీ చేశాడు. వెటోరి నెంబర్ 8వ స్థానంలో వచ్చి 2,227 పరుగులు చేశాడు. నెంబర్ 9వ స్థానంలో 1,105 రన్స్ చేశాడు.. మొత్తంగా వెటోరి 113 మ్యాచ్లలో 30 సగటుతో 4,531 పరుగులు చేశాడు.
కమ్రాన్ అక్మల్
పాకిస్తాన్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి మూడు సెంచరీలు చేశాడు. అక్మల్ 33.61 సగటుతో 874 రన్స్ చేశాడు. ఎనిమిదో స్థానంలో అక్మల్ బ్యాటింగ్ కు వచ్చి 154 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్ లోనే హైయెస్ట్ స్కోర్. అక్మల్ మొత్తంగా 53 మ్యాచ్లలో 30.79 సగటుతో 2,648 రన్స్ చేశాడు.
జాసన్ హోల్డర్
వెస్టిండీస్ ఆటగాడు జాసన్ హోల్డర్ 8, 9 స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి రెండు సెంచరీలు చేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు హోల్డర్ 32.44 సగటుతో 1,525 పరుగులు చేశాడు. అతడు ఈ స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు 202* పరుగులు చేశాడు. అది టెస్టులలో ఇతడికి టాప్ స్కోర్ గా ఉంది. హోల్డర్ మొత్తం మీద 69 టెస్టులలో 29.83 సగటుతో 3,073 పరుగులు చేశాడు.
నితీష్ కుమార్ రెడ్డి
నితీష్ కుమార్ రెడ్డి మెల్ బోర్న్ మైదానంలో సెంచరీ చేసి.. దిగ్గజాల సరసన చేరాడు. మెల్ బోర్న్ మైదానంలో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఏకంగా 103 రన్స్ చేశాడు. తన కెరియర్లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మెల్బోర్న్ మైదానంలో టీం ఇండియా కష్టాల్లో ఉండగా.. ఆపద్బాంధవుడు పాత్ర పోషించి.. సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు.