Paris Olympics 2024 : 2016 రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచింది. 2020లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. దీంతో 2024లో పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలని.. తద్వారా హ్యాట్రిక్ కొట్టాలని భారత ఏస్ షట్లర్ పివి సింధు భావించింది. మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగింది. కానీ అనూహ్యమైన ఓటమి ఆమెను ఇంటిదారి పట్టేలా చేసింది. ప్రీ క్వార్టర్స్ పోటీల్లో ఉట్టి చేతులతో ఆమె వెను తిరగాల్సి వచ్చింది. ఫలితంగా సింధు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయింది.. సింధు ఓటమితో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వాస్తవానికి ప్రీ క్వార్టర్ మ్యాచ్లో సింధు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. ఈ మ్యాచ్ మందు సింధు తండ్రి చాలా గొప్పగా చెప్పారు.. సింధు అద్భుతంగా ఆడుతుందని పేర్కొన్నారు. ఈసారి కూడా మెడల్ గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు. భారత దేశ ప్రతిష్టను సింధు మరోసారి పారిస్ వేదికగా పెంచుతుందని పేర్కొన్నారు. కానీ మ్యాచ్ ఫలితం వేరే విధంగా ఉండడంతో సింధు మెడల్ ఆశలు ఆవిరయ్యాయి.
ప్రీ క్వార్టర్స్ పోటీలో సింధు చైనా షట్లర్ హె బింగ్ బ్యాక్ చేతిలో పరాజయం పాలైంది. తొలి రౌండ్ నుంచే హె బింగ్ బావ్ ఆధిపత్యం ప్రదర్శించడం మొదలుపెట్టింది. 19-21, 14-21 తేడాతో హె బింగ్ బావ్ సింధుపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో హె బింగ్ బావ్ గెలిచింది అనేకంటే.. సింధు స్వీయ తప్పిదాలతో తనకొంప తానే ముంచుకుందనడం సబబు.
ప్రీ క్వార్టర్స్ పోటీల్లో హె బింగ్ బావ్, సింధు హోరహోరిగా తలపడ్డారు. సింధు క్రాస్ కోర్టు షాట్లతో అదరగొట్టింది.. ఇదే సమయంలో హె బింగ్ బావ్ స్మాష్ లతో చుక్కలు చూపించింది. అయితే తొలి గేమ్ లో హె బింగ్ బావ్ పై సింధు పై చేయి సాధించింది. రెండవ గేమ్ ప్రారంభం నుంచే సింధు పతనం మొదలైంది. హె బింగ్ బావ్ రెట్టించిన ఉత్సాహంతో దూకుడు కనబరిచింది.. వరుస పాయింట్లు సాధించడంతో సింధుపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది..
ఈ సమయంలో సింధు అనవసర తప్పిదాలను హె బింగ్ బావ్ పాయింట్ల రూపంలో మలచుకుంది. ఏకంగా 16-8 తేడాతో సింధుపై తిరుగులేని లీడ్ సాధించింది. మధ్యలో సింధు కాస్త ప్రతిఘటించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి వరకు లీడ్ ను కొనసాగించిన చైనా ప్లేయర్ హె బింగ్ బావ్ విజేతగా ఆవిర్భవించింది. రెండో గేమ్ ను అత్యంత చాకచక్యంగా సొంతం చేసుకొని.. సింధుకు ఏడుపును మిగిల్చింది. హ్యాట్రిక్ కలను దూరం చేసింది. సింధుపై సాధించిన విజయంతో హె బింగ్ బావ్ క్వార్టర్ ఫైనల్ వెళ్ళిపోయింది.
సింధు మాత్రమే కాదు బ్యాడ్మింటన్ విభాగంలో కీలక ఆటగాళ్లు మొత్తం ఇంటిదారి పట్టారు. లక్ష్యసేన్ మాత్రమే కాస్త ఆశలు కలిగిస్తున్నాడు. డబుల్స్ విభాగంలో సాత్విక్- సాయిరాజ్ , రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్ లోనే ఇంటికి వచ్చేశారు. రాంకీరెడ్డి – చిరాగ్ శెట్టి అరోస్ – సో వూయి(మలేషియా) చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్ వెళ్లిపోయాడు..ప్రీ క్వార్టర్ ఫైనల్ లో 21-12, 21-6 తేడాతో భారత దేశానికి చెందిన ప్రణయ్ ని మట్టి కరిపించాడు సింధు, సాత్విక్, చిరాగ్, నిఖత్ ఊహించని ఓటములతో ఇంటికి వచ్చేశారు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పటి వరకు భారత్ 3 కాంస్య పతకాలు సాధించింది. ఈ మూడు కూడా షూటింగ్ లోనే రావడం విశేషం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: In the pre quarters competition sindhu was defeated by chinese shuttler he bingback
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com