Odi World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ అయ్యుండి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమణ.. కారణాలేంటి..?

ఇంగ్లాండ్ టీమ్ లో మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ ప్రతి ప్లేయర్ కూడా ఏదో సందిగ్ధం లో ఉన్నారు.ఏ ఒక్క ప్లేయర్ కూడా మ్యాచ్ ని గెలిపించాలి అనే సంకల్పం తో ఉన్నట్టు గా కనిపించడం లేదు.

Written By: Gopi, Updated On : November 5, 2023 5:40 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా అత్యంత భారీ ఆశలతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీమ్ మొదటి నుంచి వరుస వైఫల్యాలను ఎదుర్కొంటూ వస్తుంది. ఇక అందులో భాగంగానే నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీమ్ 33 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది.ఇక ఈ మ్యాచ్ లో బెన్ స్టోక్స్,మలన్ ఇద్దరు హాఫ్ సెంచరీ చేసినప్పటికీ మిగితా వాళ్ళు రాణించకపోవడం తో ఇంగ్లాండ్ టీమ్ 253 పరుగులకు ఆల్ అవుట్ అయింది.ఇక దాంతో ఇంగ్లాండ్ టీమ్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ ఏడు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక విజయాన్ని మాత్రమే సొంతం చేసుకుని పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం లో నిలిచింది. ఇక ఇదంతా చూసిన క్రికెట్ అభిమానులు సైతం ఇంగ్లాండ్ లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది.ఇక ఈ సంవత్సరం డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది.అయినప్పటికీ ఈ టోర్నీ లో ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఇంగ్లాండ్ టీమ్ మ్యాచు లు ఆడుతుంది అసలు ఇంగ్లాండ్ టీమ్ కి ఏం అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు…

ఇంగ్లాండ్ టీమ్ లో మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ ప్రతి ప్లేయర్ కూడా ఏదో సందిగ్ధం లో ఉన్నారు.ఏ ఒక్క ప్లేయర్ కూడా మ్యాచ్ ని గెలిపించాలి అనే సంకల్పం తో ఉన్నట్టు గా కనిపించడం లేదు. 2019 లో మ్యాచ్ లు ఆడినట్టుగా ఈసారి ఆడలేదు.ఈ టోర్నీ మొదట్లో ఇంగ్లాండ్ టీమ్ మ్యాచులను ఈజీగా గెలుస్తామనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్ తో బరిలోకి దిగారు. మధ్యలోకి వచ్చేసరికి అసలు మ్యాచులను గెలుస్తామా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటూ మ్యాచులు ఆడటం స్టార్ట్ చేశారు.ఈ రెండింటి వల్ల వాళ్లు మ్యాచ్ లను వరుసగా ఓడిపోతూ వస్తున్నారు.ఇక గెలుస్తామనే కాన్ఫిడెంట్ మాత్రం వాళ్లలో ఒక్కసారి కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఆ టీమ్ కెప్టెన్ అయిన జాస్ బట్లర్ కూడా ఏం చేయలేక చేతులెత్తేస్తున్నాడు.

ఇక ఇంత దారుణమైన సిచువేషన్ లో ఇంగ్లాండ్ టీమ్ ని చూసిన ప్రతి క్రికెట్ అభిమాని ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ టోర్నీ కి ముందు సెమీఫైనల్ కి చేరుకునే జట్ల లిస్టులో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో ఉండడం చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఈ టోర్నీ లో పసికూనలు అసలు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా టోర్నీలో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ లాంటి టీమ్స్ కూడా వరుసగా మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఇంగ్లాండ్ మాత్రం వరుస ఓటములను మూటకట్టుకొని టోర్నీలో దారుణంగా విఫలమైందనే చెప్పాలి.

ఇంతకు ముందు ఒక మ్యాచ్ ముగిసిన తర్వాత జోస్ బట్లర్ మాట్లాడుతూ ఇండియన్ పిచ్ లు మాకు అనుకూలంగా లేవు, వెదర్ మాకు సపోర్ట్ చేయట్లేదు అందుకే మేము ఓడిపోతున్నాం అన్నట్టుగా మాట్లాడాడు…ఇదంతా చూసిన క్రికెట్ అభిమానులు ఇంగ్లాండ్ టీం ప్లేయర్లలో కన్ఫ్యూజన్స్ ని పెట్టుకొని మ్యాచ్ లు ఆడితే వేదర్ , పిచ్ లు ఏం చేస్తాయంటూ ఇంగ్లాండ్ టీమ్ మీద విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్క మీ టీంకు మాత్రమే పిచ్ లు, వెదర్లు సపోర్ట్ చేయట్లేదు కానీ మిగిలిన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి టీములు బాగానే గెలుస్తున్నాయి కదా ఒక మీ టీం కు మాత్రం ఏం ప్రాబ్లం వచ్చింది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం జరిగింది. ఇదంతా చూసిన ఇండియన్ అభిమానులు వీళ్లకు ఆడడం చేతకాక అలా కామెంట్లు చేస్తున్నారు అంటూ ఇంగ్లాండ్ టీమ్ పైన ఫైర్ అవడం జరిగింది…