Homeక్రీడలుక్రికెట్‌Shardul Thakur: ఒక్క బంతి కూడా వేయలేదు.. ఇంఫాక్ట్ ప్లేయర్ జోకర్ అయ్యాడు

Shardul Thakur: ఒక్క బంతి కూడా వేయలేదు.. ఇంఫాక్ట్ ప్లేయర్ జోకర్ అయ్యాడు

Shardul Thakur: ఐపీఎల్ లో మ్యాచ్ గతిని మార్చడానికి ఇంపాక్ట్ ప్లేయర్ అనే నిబంధనలను తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఐపీఎల్లో చాలా వరకు జట్లు తమకు ఓటమి ఎదురవుతుందనుకుంటున్న సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వారి సేవలను వినియోగించుకొని ఓడిపోయే మ్యాచ్లలో విజయం సాధించాయి.. బహుశా ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇంపాక్ట్ ప్లేయర్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియదనుకుంటా..

హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు తరఫున ఇంపాక్ట్ ప్లేయర్ గా శార్దూల్ ఠాకూర్ రంగంలోకి వచ్చాడు.. కానీ ఇతడితో ఒక బంతి కూడా హార్దిక్ పాండ్యా వేయించలేదు.. బుమ్రాన్ నుంచి మొదలుపెడితే అశ్వని కుమార్ వరకు భారీగా పరుగులు ఇస్తుంటే.. భయపడిన హార్దిక్ పాండ్యా ఇతడికి బంతి కూడా ఇవ్వలేదు. దీంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శార్దుల్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోయాడు.. ఇతడితో ఒక ఓవర్ కూడా వేయించలేకపోవడంతో హార్దిక్ పాండ్యా పైన విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలో బ్యాటింగ్ చేయకుండా.. బౌలింగ్ కూడా చేయకుండా మిగిలిపోయిన తొలి ఇంపాక్ట్ ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ మిగిలిపోయాడు.

వాస్తవానికి ఠాకూర్ మంచి ఆటగాడు. బౌలింగ్ బాగా చేస్తాడు. క్లిష్టమైన సమయాల్లో బ్యాటింగ్ కూడా చేస్తాడు. అనేక సందర్భాలలో అతడికి జట్టును గెలిపించిన అనుభవం ఉంది. యార్కర్, పుల్లర్ లెంత్ బంతులు అద్భుతంగా వేస్తాడు. ఇన్ స్వింగర్ బంతులు వేయడంలో అతడికి అతడే సాటి. అయితే అంతటి చరిత్ర ఉన్న శార్దూల్ సేవలను హార్దిక్ పాండ్యా వినియోగించుకోకపోవడం పట్ల విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.

” పాండ్యా దారుణంగా బౌలింగ్ వేశాడు. బుమ్రా కూడా అదే తీరుగా బౌలింగ్ వేశాడు.. మిగతావారు కూడా దారుణంగా పరుగులు ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఇంపాక్ట్ ఆటగాడి సేవలను హార్దిక్ పాండ్యా వినియోగించుకోకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఇటువంటి సారథి ముంబై జట్టు ఇకపై ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేది నిజంగా ఆశ్చర్యానికి కలిగిస్తోందని” క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version