Harsha Bhogle: ప్రస్తుతం ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ 2023లో భాగంగా సెమీ ఫైనల్ కి క్వాలిఫై అయిన టాప్ టీమ్ గా గుర్తింపు పొందింది…ఇండియా లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో 9 విజయాలను అందుకొని ఆ లీగ్ దశని పరిపూర్ణంగా పూర్తి చేసింది… ఇక ఈ లీగ్ దశలో ఎవరు అందుకోలేనట్టుగా 9 విజయాలను అందుకుని 18 పాయింట్లతో సెమిస్ లోకి మొట్టమొదట అడిగు పెట్టిన టీం గా ఇండియన్ టీం మంచి రికార్డుని సృష్టించింది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆడబోయే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీం కి అసలైన సమస్య ఎదురు కాబోతుంది.
ఎందుకంటే న్యూజిలాండ్ లాంటి ఒక బలమైన టీం ని ఢీ కొట్టాలి అంటే ఇండియన్ టీం చాలా కసరత్తులతో ఉండాలి. కొంచం నిర్లక్ష్యం వహించినా కూడా న్యూజిలాండ్ చేతిలో ఓటమి మాత్రం తప్పదు.ఇక ఇంతకు ముందు ఈ టోర్నీలో ఆడిన స్టాట్స్ ను బట్టి చూస్తే ఇండియన్ టీం న్యూజిలాండ్ టీమ్ ని ఈజీగా ఓడిస్తుంది అనే ధైర్యం ఇండియన్ టీం ప్లేయర్లతో పాటు గా, ఇండియన్ టీమ్ అభిమానుల్లో కూడా ఉన్నప్పటికీ టీమ్ మెంబర్స్ లో మాత్రం ఒక చిన్నపాటి అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు న్యూజిలాండ్ టీం మనల్ని నాకౌట్ దశలో చాలాసార్లు ఓడించింది. కాబట్టి ఈ మ్యాచ్ లో అదేమైనా రిపీట్ అవుతుందా అనే ఒక చిన్నపాటి అసంతృప్తి అయితే ప్రతి ప్లేయర్లో లోపలెక్కడో కనిపించకుండా దాగి ఉంది…
ఇక ఇలాంటి సందర్భంలోనే చాలా తెలివిగా మ్యాచ్ ని ఆడుతూ, మ్యాచ్ పొజిషన్ ని అంచనా వేస్తూ ,ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించుకుంటు ముందుకు కదిలితే తప్ప ఈ మ్యాచ్ మన కంట్రోల్లోకి రాదు… ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యూజిలాండ్ ని ఓడించడం ఇండియన్ టీం కి పెద్ద కష్టమైతే కాదు కానీ ఏ చిన్న పొరపాటు చేసినా కూడా దానికి ఇండియన్ టీమ్ భారీ మూల్యాన్ని చెల్లించడానికి కారణమవుతుందనే చెప్పాలి…
ఇక ఇదే సిచువేషన్ మీద హైదరాబాదీ సీనియర్ కామెంటేటర్ గా పేరు పొంది కొన్ని వేల మ్యాచ్ లకి తన కామెంట్రి తో ఊపు తెప్పించిన హర్ష భోగ్లే సెమీఫైనల్ మ్యాచ్ మీద ఇండియన్ ప్లేయర్లకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు…
హర్ష భోగ్లే ఐసీసీ (ఇండియన్ క్రికెట్ కౌన్సిల్) నిర్వహించే రివ్యూ పోడ్కాస్ట్ లో తాజా ఎపిసోడ్లో హోస్ట్ బ్రియాన్ ముర్గాట్రాయిడ్తో కలిసి 2023 ప్రపంచ కప్లో టీమిండియా సాధించిన విజయాల గురించి చర్చిస్తూ ఇండియన్ టీమ్ అలా అడాటానికి గల కారణాలను చెబుతూనే ఇండియన్ టీమ్ చాలా సంవత్సరాల తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది అంటూ హర్ష బోగ్లే కొన్ని అసక్తి కరమైన వ్యాఖ్యలు చేశాడు…ఇక ఇండియా న్యూజిలాండ్ టీమ్ ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ విజయం సాధిస్తుంది అంటూ చెబుతూనే ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ లో ఎలా గెలవాలి అనేదాని మీద కొన్ని సూచనలను కూడా తెలియజేశాడు.
ఇక తాజాగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లను అబ్జర్వ్ చేస్తూ వస్తున్న హర్షా భోగ్లే మాట్లాడుతూ వాంఖడే లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు టాస్ చాలా కీలకం గా మారనుందనే విషయాన్ని చెబుతూనే ఇక్కడ చేజింగ్ చేయడం కంటే మొదట బ్యాటింగ్ తీసుకొని ఎక్కువ స్కోర్ చేసి పవర్ ప్లే లో ఒక రెండు ,మూడు వికెట్లు తీసుకుంటే చాలా బాగుంటుంది.ఇక ఆ టీమ్ లో బౌలర్ల మీద కూడా ఎక్కువగా వెయిట్ పడదు అనేది చాలా స్పష్టం గా తెలియజేశారు.ఇక చేజింగ్ టైంలో ఇక్కడ ఆడటం చాలా కష్టం గత నాలుగు మ్యాచ్ ల్లో మొదటి 10 ఓవర్లలోనే 15 వికెట్లు పడ్డాయి అనే లెక్కలను కూడా చెప్పాడు… ఒక వంతు కి హర్ష బోగ్లే చెప్పింది అక్షరాలా సత్యం ఎందుకంటే చేజింగ్ లో ప్రేజర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది.. కాబట్టి మొదటి బ్యాటింగ్ చేసి మ్యాచ్ ఆడితే ఇండియా ఈజీగా ఈ మ్యాచ్ గెలుస్తుంది అంటూ కీలకమైన సలహాలను ఇండియన్ టీమ్ కి ఇవ్వడం జరిగింది….