https://oktelugu.com/

WTC Final : డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే.. విజేతగా నిలిచేదెవరు..!

ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే డబ్ల్యూటీసి సైకిల్ లో అత్యధిక పాయింట్లు జాబితాతో అగ్ర స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టును విజేతగా ప్రకటిస్తారు అని కొందరు అనుమానిస్తుంటే, వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన భారత్ కు ట్రోఫీ ఇస్తారని మరి కొంత మంది పేర్కొంటున్నారు. 

Written By:
  • BS
  • , Updated On : June 4, 2023 12:00 pm
    Follow us on

    WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు మరో రెండు రోజులే సమయం ఉంది. ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా – భారత జట్ల మధ్య లండన్ వేదికగా జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరుజట్లు సిద్ధమవుతున్నాయి. రెండు జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ మ్యాచ్ పట్ల సర్వత్ర ఆసక్తి పెరిగింది. టెస్టులకు మరింత క్రేజ్ పెంచే ఉద్దేశంతో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ను ప్రవేశపెట్టింది. ఈ టోర్నీ లో మొదటిసారి విజేతగా న్యూజిలాండ్ జట్టు భారత్ పై గెలిచి నిలిచింది. ఈ ఏడాది జరుగునున్న ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా – భారత జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరిని విజయం వరిస్తుందో..? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఒకవేళ డ్రా అయితే కప్ ఎవరికి ఇస్తారు..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
    డబ్ల్యూటీసి ఫైనల్ లో విజేతగా నిలిచి ట్రోఫీ అందుకోవాలన్న కసితో భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే టెస్ట్ క్రికెట్ లో విజయం ఏ జట్టును వరిస్తుందో చెప్పడం ఎంత కష్టమో, ఒక్కోసారి ఫలితం తేలుతుందో..? లేదో..? అని చెప్పడం కూడా అంతే కష్టం అవుతుంది. డబ్ల్యూటీసి ఫైనల్ లో ఏకైక టెస్ట్ మ్యాచ్ కావడంతో.. ఒకవేళ డ్రా అయితే కప్ ఎవరికి ఇస్తారో..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇరుజట్లు విజయం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే డబ్ల్యూటీసి సైకిల్ లో అత్యధిక పాయింట్లు జాబితాతో అగ్ర స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టును విజేతగా ప్రకటిస్తారు అని కొందరు అనుమానిస్తుంటే, వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన భారత్ కు ట్రోఫీ ఇస్తారని మరి కొంత మంది పేర్కొంటున్నారు.
    విజేతగా ప్రకటించే అవకాశం తక్కువ..
    మ్యాచ్ కనుక డ్రా అయితే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది కదా అని ఆస్ట్రేలియా జట్టుకు ట్రోఫీ ఇవ్వడం జరగదు. అదే విధంగా రెండోసారి ఫైనల్ కు చేరిన భారత్ కు ట్రోఫీ ఇచ్చే అవకాశం లేదు. రెండు జట్లను జాయింట్ విన్నర్లుగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ లో ఎక్కువ భాగం కోల్పోతే దానికి కూడా మరో ఆప్షన్ ఉంది. ఈ మ్యాచ్ కోసం మరో రిజర్వు డేను కూడా సెలెక్ట్ చేశారు. ఒకవేళ మ్యాచ్ ఏ కారణం వల్ల అయినా టైమ్ కోల్పోతే.. ఆ టైమును రిజర్వు డేలో కవర్ చేయనున్నారు. లెక్కల ప్రకారం మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో సగటున 6 గంటలపాటు మ్యాచ్ జరగాలి. లేదా రోజుకు 90 ఓవర్లు అని కూడా చెప్పవచ్చు. ఇది ఏమాత్రం అటు ఇటు అయినా రిజర్వు డే రోజున ఆ టైమ్ కవర్ చేసే అవకాశం ఉంది.
    ఓటమికి కసి తీర్చుకునే అవకాశం..
    డబ్ల్యూటీసీ ఫైనల్ లో వరుసగా రెండోసారి భారత జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని భారత జట్టు ఆకాంక్షిస్తోంది. గతంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. లేదంటే అప్పుడే భారత్ ఈ ట్రోఫీ నెగ్గాల్సి ఉంది. అప్పుడు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత జట్టుకు లభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయాన్ని నమోదు చేసి ఐసీసీ ట్రోఫీ దక్కించుకోవాలన్న కసితో భారత జట్టు ఎదురుచూస్తోంది. వచ్చిన అవకాశాన్ని భారత జట్టు సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
    అత్యంత బలంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా జట్టు..
    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు డబ్ల్యుటిసి ఫైనల్ లో బరిలోకి దిగుతున్నారు. ఇంగ్లాండు మైదానాల్లో ఆస్ట్రేలియాకు కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ మైదానాలు ఆస్ట్రేలియా జట్టుకు కొట్టిన పిండి అని చెప్పాలి. దీంతో సొంత మైదానం మాదిరిగానే ఆస్ట్రేలియా జట్టు చెలరేగిపోయే అవకాశం ఉంది. బౌలర్లు కూడా రెచ్చిపోతే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, భారత జట్టు అత్యంత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.