India Vs New Zealand Semi Final 2023:వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా న్యూజిలాండ్ టీమ్ ల మధ్యన సెమీఫైనల్ మ్యాచ్ అనేది జరగబోతుంది. ఈనెల 15వ తేదీన జరగాల్సిన ఈ మ్యాచ్ మీద అభిమానులు ఇప్పటికే విపరీతమైన అంచనాలను పెట్టుకొని ఎవరి ఊహలకు తగ్గట్టుగా వాళ్ళు అంచనాలను పెట్టుకుంటున్నారు ఇక ప్రేక్షకులు ఈ మ్యాచ్ కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతున్న సందర్భంగా అక్కడ మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే సూచనలైతే కనిపిస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలో మ్యాచ్ ఆడిన సందర్భంలో వర్షం కనక పడితే పరిస్థితి ఎంటి అనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న అయితే దీనికి ఐసిసి ఒక పరిష్కారం కూడా చూపించింది. అదేంటి అంటే సెమీఫైనల్ మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తే సెమీ ఫైనల్ మ్యాచ్ కి రిజర్వ్ డే కింద ఈ మ్యాచ్ ను నెక్స్ట్ డే నిర్వహించడం జరుగుతుందని ఐసిసి తెలియజేసింది. వర్షం వల్ల మొత్తానికే మ్యాచ్ స్టార్ అవ్వకపోతే రిజర్వుడ్ డే కింద నెక్స్ట్ డే మళ్లీ మ్యాచ్ మొదటినుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మ్యాచ్ సగం లోకి వచ్చిన తర్వాత వర్షం పడితే ఆ మ్యాచ్ కి ఎక్కడైతే బ్రేక్ పడిందో అక్కడి నుంచి నెక్స్ట్ డే కంటిన్యూ చేయడం జరుగుతుంది.
ఇక ఇలా కాకుండా రెండు రోజులు కూడా వర్షం అంతరాయం వల్ల మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే మాత్రం పాయింట్స్ టేబుల్ లో ఎవరు అగ్రస్థానంలో ఉంటారో వాళ్లు ఫైనల్ కి అఫీషియల్ గా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన ఒకవేళ న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ వర్షం కారణం గా రద్దు అయితే ఇండియా ఫైనల్ కి చేరుకుంటుంది. అలాగే సౌతాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయినట్లయితే సౌతాఫ్రికా టీం ఫైనల్ కి చేరుకుంటుంది…
ఇక 2019 లో ఇంగ్లాండ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో వర్షం కారణంగా న్యూజిలాండ్ ఒకరోజు బ్యాటింగ్ చేస్తే రిజర్వ్ డే కింద పరిగణించి ఇండియా టీమ్ ఆ తర్వాత రోజు బ్యాటింగ్ చేయడం జరిగింది.ఈ మ్యాచ్ లో ఇండియా చివరి వరకు పోరాటం చేసి 18 పరుగుల తేడా తో ఓడిపోయింది. ఇక ఇప్పుడు కూడా ఈ సెమీఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ రెండు రోజులూ వర్షం వల్ల మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే మాత్రం న్యూజిలాండ్ ని మరోసారి వాళ్ళ దురదృష్టం వెంటడుతుందనే చెప్పాలి. నిజానికి 2019 సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఇండియా వర్షం పడకుండా డైరెక్ట్ మ్యాచ్ ఆడినట్టయితే ఇండియా ఓడిపోయేది కాదు…