WTC Final 2025 : ఎప్పుడైతే న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టులు ఓడిపోయిందో.. అప్పుడే భారత్ కథ మరో విధంగా మారింది. స్వదేశంలో వరుసగా మూడు టెస్టులు ఓడిపోవడంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ టేబుల్ లో రెండవ స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పై పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ గెలిచింది. మొత్తంగా మరోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ టేబుల్ లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అయితే అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఓడిపోవడంతో మూడో స్థానానికి దిగజారాల్సి వచ్చింది. ఇప్పుడు టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలంటే అనేక అద్భుతాలు జరగాలి. ఆస్ట్రేలియాపై మిగతా మూడు టెస్టులు కచ్చితంగా గెలవాలి. అలా జరగకుంటే మిగతా జట్ల ఆట తీరుపై ఆధారపడాలి. అప్పుడే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళుతుంది. ఒకవేళ ఒక మ్యాచ్ డ్రా చేసుకొని.. మిగతా రెండు గెలిస్తే భారత్ ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియాపై భారత్ 4-1 తేడాతో సిరీస్ గెలిస్తే 64.05 విన్నింగ్ పర్సంటేజ్ సొంతం చేసుకుంటుంది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి ప్రవేశిస్తుంది.. అనుకోని పరిస్థితుల్లో 3-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంటే.. 60.52 విన్నింగ్ పర్సంటేజ్ సాధిస్తుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను అధిగమించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ప్రవేశిస్తుంది.. ఒకవేళ ఈ సిరీస్ 2-2 డ్రా అయితే రోహిత్ సేన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అది జరగాలంటే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో వైట్ వాష్ చేయాలి. ఒకవేళ శ్రీలంక ఆ రెండు మ్యాచ్లను డ్రా చేసుకుంటే 55.26 విన్నింగ్ పర్సంటేజ్ తో భారత్, ఆస్ట్రేలియా ఈక్వల్ స్టేజ్ లో ఉంటాయి. అప్పుడు విక్టరీలపరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా కంటే భారత్ ముందు స్థానంలో ఉంటుంది కాబట్టి.. భారత్ ఫైనల్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే
మూడోసారి కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి భారత్ వెళ్లాలంటే అసాధారణ ఆట తీరు ప్రదర్శించాలి. ముఖ్యంగా మిగిలిన మూడు టెస్టులు గెలవడానికి ప్రయత్నించాలి. బ్యాటింగ్ విభాగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి. జట్టు విజయమే ముఖ్యం కాబట్టి ఫామ్ లో లేని ఆటగాళ్లు త్యాగాలకు సిద్ధపడాలి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు తమ పూర్వపు ఫామ్ అందిపుచ్చుకోవాలి. మెరుగ్గా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించాలి. లేకుంటే భారత్ మూడోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లడం దాదాపు అసాధ్యం. రెండో టెస్టులో కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు కాబట్టి.. మూడో టెస్ట్ నాటికి వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. లేకపోతే కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించాలి. ఇదే తీరున ఆటగాళ్లు గనుక నిర్లక్ష్యం ప్రదర్శిస్తే.. ఈసారి టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడం దాదాపు అసాధ్యం.