Odi World Cup 2023: ఇండియా ఈసారి వరల్డ్ కప్ కొట్టాడానికి భారీగా ప్రయత్నాలు చేస్తుంది.అందులో భాగంగానే ఇప్పుడు ఏషియా కప్ ఫైనల్ లో కూడా ఒక సూపర్ మ్యాచ్ ఆడటానికి రెడీ అవుతుంది.ఇక ఏషియా కప్ విషయం పక్కన పెడితే వరల్డ్ కప్ అనేది ఈసారి ఇండియాలోనే ఆడుతున్నారు కాబట్టి ఇండియా వరల్డ్ కప్ కొడితేనే రోహిత్ శర్మ ఇక ముందు కూడా కెప్టెన్ గా కొనసాగుతారు లేకపోతే రోహిత్ ని కెప్టెన్ గా పక్కన పెట్టేసి వేరే కెప్టెన్ ని తీసుకునే అవకాశం అయితే ఉంది.ఇక ఆల్రెడీ ఇండియా కి వరల్డ్ కప్ వచ్చి 12 సంవత్సరాలు దాటుతున్న మరోసారి వరల్డ్ కప్ రాకపోవడం నిజంగా మన టీం కి భారీ అవమానం అనే చెప్పాలి.
ఎప్పుడైతే ధోని కెప్టెన్ గా తప్పుకున్నాడో అప్పటి నుంచి ఇండియా కి వరల్డ్ కప్ అనే కాదు ఒక్క ఐసీసీ కప్పు కూడా రాలేదు. అంటే ధోని లేకపోతే ఇండియా టీం ఐసీసీ నిర్వహించే కప్పులు కొట్టలేదా అనే డౌట్ అందరిలో ఉంది.ఇక ఈ విషయానికి బలం చేకూరుస్తూ మొన్న జరిగిన wtc ఫైనల్ మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా మీద ఇండియా దారుణంగా ఓడిపోవడం జరిగింది.దీనికి కూడా రోహిత్ శర్మ నే ప్రాతినిధ్యం వహించాడు ఇక కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎలాగైతే ఐసీసీ కప్పులు కొట్టలేకపోయారో ఇప్పుడు రోహిత్ వచ్చాక కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుంది.అందుకే ధోని లేకపోయినా మనం ఐసీసీ కప్పులు కొట్టగలం అని ఈ వరల్డ్ కప్ కొట్టి ప్రూవ్ చేయాలి.లేకపోతే ఇండియా టీంని బయటి దేశాల వాళ్ళు ధోని లేక పోతే వీళ్లు కప్పులు కొట్టలేరు అంటూ కామెంట్ చేసే ప్రమాదం ఉంది.అలాగే మన ప్లేయర్లలో కూడా ధోని లేకపోతే మనం కప్పులు కొట్టలేమా అనే ఒక రకమైన నెగిటివ్ ఆలోచనలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇక రోహిత్ శర్మ సారధ్యం లో ఆడుతున్నఈ వరల్డ్ కప్ కోసం ప్లేయర్ల పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్ ప్లేయర్లని తీసుకున్నారు.
అయితే వరల్డ్ కప్ టీం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలంటే శిఖర్ ధావన్ ని తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఓపెనర్ గా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబో బ్యాట్స్ మెన్స్ ఉంటె బౌలింగ్ వేసే బౌలర్లకు సరైన లైన్ అండ్ లెంత్ దొరకదు. అలాగే బ్యాట్స్ మెన్స్ కంటిన్యూస్ గా స్ట్రైక్ ని రొటేట్ చేయగలిగితే ఇక బౌలర్ ప్రతి బాల్ కి తన లైన్ అండ్ లెంత్ మార్చుకోవాల్సి వస్తుంది.దానివల్ల బౌలర్ డిస్ట్రబ్ అయిపోయి కొన్ని లూజ్ బాల్స్ పడే అవకాశం ఉంటుంది.అలాంటి బాల్స్ వల్ల మన టీం కి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంది.అందుకనే శిఖర్ ధావన్ ని వరల్డ్ కప్ స్క్వాడ్ లో తీసుకుంటే బాగుండేది…అయన కూడా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు…