https://oktelugu.com/

BCCI : మన పిచ్ లపై ఐసీసీ సంచలన నివేదిక.. ఆ జాబితాలో చెత్త మైదానం ఏదంటే?

క్రికెట్ గ్లోబల్ క్రీడ. కొన్ని సంవత్సరాల నుంచి అది కాస్తా రిచ్ స్పోర్ట్ లాగా అవతరించింది. క్రికెట్ ఆధారంగా వేలకోట్ల వ్యాపారం దర్జాగా సాగుతోంది. ఈ క్రమంలో క్రికెట్ ఆడే మైదానాలపై ఐసీసీ ప్రతి సంవత్సరం నివేదిక ఇస్తుంది. ఈ ఏడాది కూడా అలాంటి నివేదిక ఇచ్చింది.

Written By: NARESH, Updated On : November 9, 2024 8:18 am

Indian pitches quality

Follow us on

BCCI : ఇటీవల టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడింది.. స్వదేశంలో ఆడుతోంది కాబట్టి టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. పైగా టీమిండియాతో ఆడే కంటే ముందు న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా, శ్రీలంకల చేతిలో టెస్టు సిరీస్ లు ఓడిపోయింది. దీంతో అందరి అంచనాలు భారత జట్టు పైనే ఉన్నాయి. కానీ భారత గడ్డపై న్యూజిలాండ్ అడుగుపెట్టిన తర్వాత ఒకసారిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బెంగళూరు, పూణే, ముంబై.. ఇలా వేదికలు మాత్రమే మారాయి.. ఓటమి మాత్రం అదే. టీమిండియా అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. న్యూజిలాండ్ చేతిలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓడిపోయింది. ఏ విధంగా మూడు టెస్టులు పరాజయం పాలై.. వైట్ వాష్ కు గురైంది. ఈ నేపథ్యంలో మైదానాలను స్పిన్ వికెట్ గా రూపొందించడం పట్ల బీసీసీఐపై అభిమానులు ఆగ్రహ వ్యక్తం చేశారు. చెత్త మైదానాలను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో అభిమానులు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సంచలనాన్ని సృష్టించాయి. ఈ క్రమంలో ఐసిసి మనదేశంలోని మైదానాలపై నివేదికలను రూపొందించి.. ఆ వివరాలను వెల్లడించింది.

చెత్త మైదానం అదే

ఐసీసీ నివేదికలో చెత్త మైదానంగా కాన్పూర్ నిలిచింది. అత్యుత్తమంగా చెన్నై మైదానానికి కీర్తి లభించింది. ఇక ఈ జాబితాలో మరో నాలుగు మైదానాలు కేవలం పాస్ మాత్రమే అయ్యాయి. ఇటీవల కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో.. వర్షం కురిసింది. దీనివల్ల రెండు రోజులపాటు ఆట నిర్వహించడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ మిగతా రోజుల్లోనే భారత్ మ్యాచ్ ముగించింది. అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మైదానంలో ఉన్న అవుట్ ఫీల్డ్ పై ఐసీసీ తన అసంతృప్తిని బయటపెట్టింది. అయితే వర్షం కురవడం.. మైదానాన్ని సిద్ధం చేయడంలో జాప్యం ఏర్పడడంతో.. ఐసీసీ పై విధంగా నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయిన బెంగళూరు, పూణే, ముంబై మైదానాలపై ఐసీసీ కాస్త సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్ జట్టుతో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ నిర్వహించిన హైదరాబాద్, గ్వాలియర్, ఢిల్లీ మైదానాలపై కూడా ఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసింది. టి20 క్రికెట్ నిర్వహిస్తున్న మైదానాలు మొత్తం బాగున్నాయని ఐసీసీ ప్రకటించింది. అయితే న్యూజిలాండ్ సిరీస్ నిర్వహించిన మూడు మైదానాలపై ఐసీసీ సంతృప్తికరమైన నివేదిక ఇచ్చినప్పటికీ.. బీసీసీఐ మాత్రం అసంతృప్తితోనే ఉంది. స్పిన్ వికెట్ ను రూపొందించడమే తమ జట్టు పాలిట శాపంగా మారిందని బీసీసీఐ పెద్దలు ఇటీవల అంతర్గత సంభాషణలలో వ్యాఖ్యానించారు. అయితే త్వరలో స్వదేశంలో జరిగే మ్యాచ్లకు సంబంధించి.. భిన్నమైన వికెట్ తో రూపొందించాలని బీసీసీఐ భావిస్తోంది. మొత్తానికి భారత మైదానాలపై ఐసీసీ వెలువరించిన నివేదిక సంచలనంగా మారింది. నివేదిక ద్వారానైనా బీసీసీఐ మైదానాల రూపకల్పనలో జాగ్రత్త వహించాలని అభిమానులు కోరుతున్నారు