ICC increases WTC final prize money : ఇప్పుడున్న లెజెండ్ క్రికెటర్లు మొత్తం సుదీర్ఘ ఫార్మాట్ లో తమను తాము నిరూపించుకున్నవారే. అందులో సత్తా చాటిన తర్వాతే మిగతా ఫార్మాట్లో అదరగొట్టారు.. అందువల్లే సుదీర్ఘ ఫార్మాట్ విషయంలో వారికి ఖచ్చితమైన అంచనా ఉంటుంది. కాకపోతే కాలానుగుణంగా సుదీర్ఘ ఫార్మాట్ కు ఆ ప్రభ తగ్గుతూ వస్తోంది. దానికి మరింత విలువ పెంచడానికి.. అభిమానులలో స్థాయి పెంచడానికి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూటీసీ విజేతకు, పరాజిత జట్టుకు గతంలో ఇచ్చే దానికంటే ఎక్కువ ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఐసీసీ సుముఖత వ్యక్తం చేసింది.. ఇక త్వరలో కంగారు, సఫారీ జట్ల మధ్య జరిగే చివరి అంచె పోరులో నెగ్గిన వారికి భారీగా నజరానా లభించనుంది.
ఇంగ్లీష్ దేశంలోని లార్డ్స్ మైదానంలో ఈనెల 11 నుంచి సఫారీ, కంగారు జట్ల మధ్య డబ్ల్యూటీసీ చివరి అంచె పోటీ జరుగుతుంది. ఇందులో విజయం సాధించిన బృందానికి 3.6 మిలియన్ డాలర్లు లభిస్తాయి. ఓడిపోయిన బృందానికి 2.16 మిలియన్ డాలర్లు బహుమతిగా అందుతాయి. క్రితం సీజన్లో కంగారు జట్టు రోహిత్ సేనను ఓడించి తొలిసారిగా టెస్ట్ గద అందుకుంది.. ఈ సీజన్లో కూడా చివరి అంచె దాకా వెళ్లి.. మరోసారి టెస్ట్ గద అందుకోవాలని కంగారు జట్టు అంచనా వేస్తోంది. ఇక సఫారి జట్టు కూడా తొలిసారి డబ్ల్యూటీసీ చివరి అంచె పోటీలోకి వచ్చింది. మొత్తంగా టెస్ట్ గదను అందుకోవాలనే భారీ ఆశలతో ఉంది.. చివరి పోటీలో కంగారు జట్టుకు కమిన్స్, సఫారి జట్టుకు బవుమా నాయకత్వం వహిస్తారు. వీరిద్దరు కూడా తమ జట్లను విజేతలుగా నిలపాలని అంచనాలతో ఉన్నారు. ఈసారి ఐసీసీ ప్రైజ్ మనీ భారీగా పెంచిన నేపథ్యంలో.. గెలిచిన జట్టుకు దండిగా నజరానా లభిస్తుంది. ఓడిన జట్టుకు కూడా బీభత్సంగానే నగదు బహుమతి అందుతుంది. గెలిచిన జట్టు 30.88 కోట్లను అందుకుంటుంది.. గత రెండు ఎడిషన్లను పరిశీలిస్తే గెలిచిన బృందానికి 1.6 మిలియన్ డాలర్లు లభించేవి. ఇప్పుడు ఏకంగా 2.16 మిలియన్ డాలర్లకు ఐసీసీ పెంచింది. అంటే గతంతో పోల్చి చూస్తే డబుల్ ప్రైజ్ మనీ ఇప్పుడు గెలిచే జట్టుకు లభిస్తుందని అర్థం. ఇక ఈ డబ్బు ఐపిఎల్ లో గెలిచిన జట్టుకు ఇచ్చే డబ్బు కంటే అధికం. ఐపీఎల్లో విజేతగా నిలిచిన జట్టుకు 20 కోట్లు బహుమతిగా ఇస్తున్నారు.
Also Read : మరికొద్ది క్షణాల్లో మ్యాచ్.. ఐసీసీ చైర్మన్ బెంగళూరు ఆటగాళ్ల హోటల్ కు ఎందుకు వెళ్ళినట్టు?
తాజా ఫైనల్లో ఏ జట్టు గెలిచినా చరిత్ర సృష్టించినట్టే. కంగారు జట్టు గెలిస్తే వరుసగా రెండవసారి టెస్ట్ గదను అందుకున్న బృందంగా నిలుస్తుంది. సఫారి జట్టు విజయాన్ని అందుకుంటే.. తొలిసారి టెస్ట్ గదను సొంతం చేసుకున్న బృందంగా నిలబడుతుంది.. పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలపై జరిగిన టెస్ట్ సిరీస్ లను సఫారి జట్టు సొంతం చేసుకుంది. స్వదేశంలో ఇండియాతో జరిగిన సిరీస్ ను డ్రా చేసుకుంది. తద్వారా ఫైనల్ వెళ్లిపోయింది.. బిజిటీలో 3-1 తేడాతో సిరీస్ దక్కించుకొని.. కంగారు జట్టు ఫైనల్ వెళ్ళింది.