ICC World Cup Schedule 2023: క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ఖరారైంది. ఐసీసీ దీనిపై అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే దీని నిర్వహణకు కసరత్తు చేస్తోంది. 2023 వరల్డ్ కప్ నిర్వహణ బాధ్యత ఈసారి భారత్ తీసుకోనుంది. అందుకు సంబంధించిన విధానాలను ఇప్పటికే రూపొందించారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దేశంలోని పలు పట్టణాల్లో మొత్తం 46 రోజుల పాటు ఈ వేడుక సాగనుంది. అయితే ఈసారి వరల్డ్ కప్ లో భారత్ తో పాక్ ఎప్పుడు పోరాడుతుందో తెలుసుకుందాం.
వరల్డ్ కప్ 2023ని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రారంభించనున్నారు. ఆ తరువాత బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువహతి, హైదరాబాద్, కోల్ కతా, లక్నో, ఇండోర్, రాజ్ కోట్, ముంబైల్లో మొత్తం 12 వేదికల్లో 48 మ్యాచులు ఆడనున్నారు. అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 వరకు సాగనుంది. ఇప్పటికే ఆయా స్టేడియాల్లో వరల్డ్ కప్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసారి వరల్డ్ కప్ కోసం ఏడు జట్లు అర్హత సాధించాయి. ఐసీసీ ప్రపంచ కప్ కోసం సూపర్ లీగ్ స్టాండింగ్స్ లో మొదటి ఎనిమిది జట్లు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అస్ట్రేలియా, అప్ఘనిస్తాన్ లు క్వాలిఫై అయ్యాయి. వీటిలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంకలు తమ స్థానాలు ఇంకా బుక్ చేసుకోలేదు. తమ స్థానాల కోసం పోటీ పడుతున్నాయి.
ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ నేపథ్యంలో అందరి ఆసక్తి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచు లు ఎప్పుడు ఉంటాయిని ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు వస్తున్న షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ బెంగుళూరు, చెన్నై, కోల్ కతాలో మాత్రమే ఆడుతుంది. భద్రతా కారణాల వల్ల ఈ మూడు వేదికలకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తమ మ్యాచ్ లు కోల్ కతా, గుహవతి ల్లోనే ఉంటుంది. భారత్ ఏడు వేదికల్లో మ్యాచులను ఆడుతుంది. భారత్, పాకిస్తాన్ లో ఈసారి గ్రూప్ బిలో ఉన్నట్లు పేర్కొన్నారు. సూపర్ మ్యాచ్ లకంటే ముందే భారత్, పాకిస్తాన్ తో తలపడనుంది.