ICC one day rankings : ఐసీసీ వెల్లడించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిన్నటిదాకా నాలుగో స్థానంలో ఉండగా.. ప్రస్తుతం అతడు ఐదో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి వచ్చాడు. యువ ఆటగాడు గిల్ తన నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 84 పరుగులు చేశాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఆ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించేలా అతడు కృషి చేశాడు. ఇక రోహిత్ శర్మ తన స్థిరమైన ఫామ్ కొనసాగిస్తున్నప్పటికీ.. భారీ పరుగులు చేయలేకపోవడంతో అతడు ఐదు స్థానానికి పడిపోయాడు.. వన్డే ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే గిల్ మొదటి స్థానంలో, బాబర్ ఆజాం రెండవ స్థానంలో, క్లాసెన్ మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, రోహిత్ శర్మ ఐదవ స్థానంలో, హ్యారీ టెక్టర్ ఆరవ స్థానంలో, దారిల్ మిచెల్ ఏడో స్థానంలో, అయ్యర్ ఎనిమిదో స్థానంలో, అసలంక తొమ్మిదో స్థానంలో, ఇబ్రహీం జద్రాన్ 10వ స్థానంలో కొనసాగుతున్నారు.
Also Read : పాకిస్తాన్ తో మ్యాచ్ అనగానే విశ్వరూపం చూపిస్తున్న విరాట్.. మేమేం చేశామని పాకిస్తానీ ట్వీట్ వైరల్
36 సంవత్సరాల వయసులోనూ..
36 సంవత్సరాల వయసులోనూ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో సత్తా చూపిస్తున్నాడు. తిరుగులేని ఫామ్ కొనసాగిస్తూ వారెవా అనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 747 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ మధ్య జరగడం.. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన 84 పరుగులు చేయడంతో అతడికి 747 రేటింగ్ పాయింట్లు లభించాయి. అయితే విరాట్ కోహ్లీ కెరియర్ లో బెస్ట్ రేటింగ్ 2018 లో వచ్చింది. హెడింగ్లీ లో ఇంగ్లాండ్ జట్టుపై అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించడంతో విరాట్ కోహ్లీకి 909 పాయింట్లు లభించాయి. రోహిత్ శర్మ 744 పాయింట్ల తో కొనసాగుతూ ఉండగా.. విరాట్ కోహ్లీ 745 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ లో గిల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గిల్ 791 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 2023లో ఇండోర్లో ఆస్ట్రేలియాపై సూపర్ ఇన్నింగ్స్ ఆడిన గిల్.. 847 పాయింట్లను నమోదు చేసుకున్నాడు. అతడి కెరియర్లో ఇవే హైయెస్ట్ గణాంకాలు. పాకిస్తాన్ దేశానికి చెందిన బాబర్ అజాం 770 పాయింట్లు తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటికీ అతడు ఈ ఫార్మాట్లో తన ప్రతిభను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ క్లా సెన్ 760 పాయింట్లు తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడి కెరియర్ లో ఇది అత్యుత్తమ ర్యాంక్. శ్రేయస్ అయ్యర్, అసలంక, ఇబ్రహీం జద్రాన్ టాప్ -10 లో కొనసాగుతున్నారు.. ఛాంపియన్స్ ట్రోఫీ లో అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ 702 పాయింట్లతో 8 వ స్థానంలో కొనసాగుతున్నాడు. అసలంక 694, ఇబ్రహీం జద్రాన్ 676 పాయింట్లతో 9, 10 స్థానంలో కొనసాగుతున్నారు
Also Read : సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై త్వరగానే అవుట్ అయినా.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొలి కెప్టెన్ గా ఘనత..