Homeక్రీడలుCWC Qualifiers 2023 : వరల్డ్ క్వాలిఫయర్స్ నుంచి విండీస్ ఔట్.. షాకిచ్చిన పసికూన! 

CWC Qualifiers 2023 : వరల్డ్ క్వాలిఫయర్స్ నుంచి విండీస్ ఔట్.. షాకిచ్చిన పసికూన! 

CWC Qualifiers 2023  : వన్డే వరల్డ్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లలో సంచలనాలు నమోదవుతున్నాయి. భారత్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో వరల్డ్‌ కప్‌ జరుగనుంది. జింబాబ్వే వేదికగా ప్రస్తుతం వీటికి సంబంధిన క్వాలిఫయర్‌ మ్యాచులు జరుగుతున్నాయి. వచ్చే నెల 9 వరకు ఈ మ్యాచులు జరగనుండగా..అన్ని జట్లు లీగ్‌ మ్యాచులు ఆడేస్తున్నాయి. ఇక ఈ మ్యాచులో వెస్టిండీస్‌ జట్టుకి ఒక పసికూన జట్టు జింబాబ్వే ఉహించని షాకిచ్చింది. పటిష్టమైన విండీస్‌ జట్టుపై సమష్టిగా ఆడి సంచలన విజయం నమోదుచేసింది. వరుసగా మూడో విజయంతో జింబాబ్వే సూపర్‌ సిక్స్‌ రేసులో ముందడుగు వేసింది. గ్రూప్‌–ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. నెదర్లాండ్స్‌ జట్టు 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటే నెట్‌రన్‌∙రేటులో వెనకబడిన విండీస్‌ మూడో ప్లేస్‌కు పడిపోయింది.

పటిష్ట జట్టుపై సమష్టిగా ఆడి.. 
హరారే వేదికగా వెస్టిండీస్‌–జింబాబ్వే మధ్య శనివారం లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. పసికూన జట్టు అని తేలికగా తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో విండీస్‌కు తెలిసి వచ్చేలా చేసింది జింబాబ్వే జట్టు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 50 ఓవర్లు ఆడకుండానే 268 పరుగులకే ఆలౌటైంది. స్టార్‌ ప్లేయర్‌ సికందర్‌ రాజా(68) బారెల్‌ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో విండీస్‌ సులభంగానే గెలిచేస్తుంది అంతా అనుకున్నారు. కానీ జింబాబ్వే బౌలర్ల ధాటికి 233 పరుగులకే ఆలౌట్‌ అయి ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ఉంది. విండీస్‌ జట్టులో కైల్‌ మేయర్స్‌ అర్ధ సెంచరీతో రాణించినా.. మిగిలిన వారెవరు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు.
సొంత గండ్డపై అభిమానులకు కిక్‌.. 
సొంతగడ్డపై చిరస్మరనీయ విజయాన్ని అందుకున్న జింబాబ్వే .. అభిమానులకి మంచి కిక్‌ ఇచ్చింది. ఈ మ్యాచులో జింబాబ్వే ఆడియన్స్‌ వీరికి సపోర్ట్‌ చేసిన విధానం చూస్తుంటే ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. వికెట్‌ పడినప్పుడల్లా గ్రౌండ్‌లో అంతా మారు మ్రోగింది. మొత్తానికి వరల్డ్‌ క్వాలిఫయర్స్‌లో తొలి సంచలనం నమోదయింది. అసలే వరల్డ్‌ కప్‌కి అర్హత సాధించని విండీస్‌ జట్టుకు ఇప్పుడు జింబాబ్వే రూపంలో గట్టి షాక్‌ తగిలింది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular