Odi World Cup 2023
Odi World Cup 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ – 2023 సిరీస్ అక్టోబర్ 5న ప్రారంభం అవుతుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడబోతుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది. ఈసారి వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్, నవంబర్‌లో ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుంది. క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే ఇండియా–పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లు ఇవే..
వరల్డ్ కప్‌ను పది వేదికలపై ఐసీసీ నిర్వహించబోతుంది. దీనికోసం ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, అహ్మదాబాద్‌లో స్టేడియంలను సిద్ధం చేసింది.
మూడు మైదానాల్లో వార్మప్ మ్యాచ్‌లు
టోర్నీ ప్రారంభానికి ముందు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వార్మప్ మ్యాచులు జరుగుతాయి. వీటిని హైదరాబాద్, గువహటి, తిరువనంతపురంలో నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 29న బంగ్లాదేశ్–శ్రీలంక,
న్యూజిలాండ్–పాకిస్తాన్
సౌతాఫ్రికా – అఫ్ఘానిస్తాన్
సెప్టెంబర్ 30 : ఇండియా – ఇంగ్లాండ్
ఆస్ట్రేలియా – నెదర్లాండ్స్
అక్టోబర్ 2 : ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్
అక్టోబర్ 3 : ఇండియా – నెదర్లాండ్స్
అఫ్ఘానిస్తాన్ – శ్రీలంక
పాకిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లు
జరుగుతాయి.
ఈ మ్యాచ్‌లు 12.30 గంటల నుంచి హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమవుతాయి. వార్మప్ మ్యాచ్ వన్, టూలో ఇప్పటికే శ్రీలంక, నెదర్లాండ్స్ విజయం సాధించాయి.
హైదరాబాద్‌లో మ్యాచ్‌లు..
హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో మూడు వరల్డ్ కప్ మ్యాచులు జరుగుతాయి. అక్టోబర్ 6, 9, 12న హైదరాబాద్‌లో మ్యాచులు జరుగుతాయి. ఇండియా ఈ టోర్నీలో కనీసం 9 మ్యాచులు ఆడుతోంది. అయితే, హైదరాబాద్‌లో ఇండియాకు సంబంధించిన మ్యాచులు మాత్రం లేకపోవడం నిరాశ కలిగించే అంశం. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచులు మాత్రమే హైదరాబాద్‌లో జరుగుతాయి.
ఇండియా తొమ్మిది మ్యాచులు
ప్రపంచ కప్‌లో ఇండియా తొమ్మిది మ్యాచులు ఆడుతుంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో (చెన్నై), అక్టోబర్ 11న ఆఫ్గనిస్తాన్‌తో(ఢిల్లీ), అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో(అహ్మదాబాద్), అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో(పూణే), అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో (ధర్మశాల), అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో (లక్నో), నవంబర్ 2 శ్రీలంకతో (ముంబై), నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో (కోల్‌కతా), నవంబర్ 11 నెదర్లాండ్ తో (బెంగళూరు) మ్యాచులు జరుగుతాయి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Icc cricket world cup 2023 complete schedule tournament starts from october 5 details of india matches
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com