IPL Auction SRH : ఐపీఎల్ లో ప్రపంచ ప్రఖ్యాత ఆల్ రౌండర్లను వదిలేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. దేశీయ అన్ క్యాప్ డ్ ఆటగాళ్లపై పడింది. అయితే వారు కూడా ఏం పేరున్న వారు కాదు. ఇటీవల దేశవాళీ ట్రోఫీ కాస్త సత్తా చాటి వెలుగులోకి వచ్చారు. వారి ప్రతిభను గుర్తించి తక్కువ ధరకే వీరిని చేజిక్కించుకుంది. ఇక సన్ రైజర్స్ కొన్న అన్ క్యాప్ డ్ ప్లేయర్లలో అందరిలోకి 2.5 కోట్లు పెట్టి జమ్మూ కశ్మీర్ ఆటగాడు వివ్రాంత్ శర్మను కొనుగోలు చేసింది.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు వేలంలో కొన్న ఆటగాళ్లు వారి ధర చూస్తే.. హ్యారీ బ్రూక్ (13.25 కోట్లు), మయాంక అగర్వాల్ (8.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (5.25 కోట్లు), ఆదిల్ రషీద్ (2 కోట్లు), మయాంక్ మార్కండే (50 లక్షలు), వివ్రాంత్ శర్మ (2.5 కోట్లు), సమర్థ్ వ్యాస్ (20 లక్షలు) ), సన్వీర్ సింగ్ (20 లక్షలు), ఉపేంద్ర సింగ్ యాదవ్ (25 లక్షలు) చొప్పున వెచ్చించి కొనుగోలు చేసింది.
ఇందులో అత్యధిక ధర అన్ క్యాప్ డ్ ప్లేయర్ అయిన వివ్రాంత్ శర్మకే. వివ్రాంత్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్. పైగా ఓపెనర్ కూడా. 2022 విజయ్ హజారే ట్రోఫీలో అతడు వీర విహారం చేశాడు. ఉత్తరాఖండ్ జట్టుపై 124 బంతుల్లో 154 పరుగులు చేశాడు.. ఈ ఇన్నింగ్స్ అతడి కెరియర్ ను కీలక మలుపు తిప్పింది. జమ్ము కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో తన తొలి నాకౌట్ బెర్త్ ను సంపాదించడంలో సహాయపడింది. అంతేకాదు టోర్నమెంట్లో అంతకుముందు, రంజి ట్రోఫీ డిపెండింగ్ ఛాంపియన్ ప్రదేశ్ పై జమ్మూ కాశ్మీర్ జట్టు తరఫున 343 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు వివ్రాంత్ 62 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఈ 50 ఓవర్ల టోర్నమెంట్లో 56.42 సగటుతో 395 పరుగులు చేసి జట్టు తరుపున రెండవ అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.
మరో అన్ క్యాప్ ప్లేయర్ సమర్థ్ వ్యాస్ సౌరాష్ట్ర తరపున ఆడే భారతీయ క్రికెటర్. అతను 2015-16 రంజీ ట్రోఫీలో 23 నవంబర్ 2015న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.
ఇక మరో క్రికెటర్ సన్వీర్ సింగ్ భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో 28 సెప్టెంబర్ 2018న పంజాబ్ తరఫున తన లిస్ట్ A అరంగేట్రం చేశాడు. అతను 2018–19 రంజీ ట్రోఫీలో 1 నవంబర్ 2018న పంజాబ్ తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు, మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఈసారి విజయ్ హాజరే కప్ లోనూ రాణించాడు.
మయాంక్ మార్కండే 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడే భారతీయ క్రికెటర్. మయాంక్ పాటియాలాకు చెందినవాడు. అతను పాటియాలాలోని యాదవీంద్ర పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు మరియు స్కూల్ క్రికెట్ టీమ్‌లో సభ్యుడు. అతను ఫిబ్రవరి 2019లో భారత క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
బెన్ స్టోక్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఆల్ రౌండర్ ను కొనకుండా ఇలా దేశవాళీ అన్ క్యాప్ డ్ ప్లేయర్లను కొన్న సన్ రైజర్స్ ఎలా భర్తీ చేస్తుందన్నది వేచిచూడాలి.