ICC Cricket World Cup: ఈ వరల్డ్ కప్ లో విన్నర్స్ ప్రైజ్ మనీ ఎంతంటే..?

ఇక సెమీ ఫైనల్ కి వచ్చి ఓడిపోయిన టీమ్ లకి 6.65 కోట్లు ఇక లీగ్ దశలో పాల్గొన్న జట్ల కి 83.22 లక్షలు ఇచ్చారు... ఇక ఒక్క అడుగు దూరంలో ఇండియన్ టీం వరల్డ్ కప్ ఓడిపోవడం అనేది బ్యాడ్ విషయం అనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : November 20, 2023 12:51 pm
Follow us on

ICC Cricket World Cup: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీమ్ వరుసగా విజయాలు సాధిస్తూ వరుసగా 9 విజయాలను సాధించి అందరికంటే ముందు వరుసలో సెమీఫైనల్ కి చేరుకుంది. ఇక ఇప్పుడు భారీ విజయాన్ని సాధించి ఫైనల్ కి వచ్చినా కూడా ఇండియన్ టీం కి ఫైనల్ లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా టీమ్ మీద మరోసారి ఓడిపోవడం అనేది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక ఇది ఇలా ఉంటే విశ్వ విజేత నిలిచిన ఆస్ట్రేలియా టీమ్ కు ప్రైజ్ మనీ గా 33.29 కోట్లు ఇచ్చారు… అలాగే రన్నరప్ గా మిగిలిన ఇండియన్ టీం కి 16.64 కోట్లు ఇచ్చారు.

ఇక సెమీ ఫైనల్ కి వచ్చి ఓడిపోయిన టీమ్ లకి 6.65 కోట్లు ఇక లీగ్ దశలో పాల్గొన్న జట్ల కి 83.22 లక్షలు ఇచ్చారు… ఇక ఒక్క అడుగు దూరంలో ఇండియన్ టీం వరల్డ్ కప్ ఓడిపోవడం అనేది బ్యాడ్ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా అంచనాలతో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ ఇలాంటి పర్ఫామెన్స్ ఇస్తుంది అనేది మాత్రం ఎవరు ఊహించలేదు కానీ ఆస్ట్రేలియన్ బౌలర్ లలో ఇండియన్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు ఇలా చేయడం వల్ల అభిమానుల్లో కూడా ఇండియన్ టీం మీద గౌరవం అనేది పోతుంది. ఎందుకంటే భారీ ఎత్తున అభిమానులు ముందుగానే ఈసారి మనకు కప్పు వస్తుంది అనే కాన్ఫిడెంట్ తో ఉన్నప్పుడు అది చూసి ఇండియన్ టీమ్ ని ఎంకరేజ్ చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్న టీం ఈసారి కప్పు కూడా కొడుతుంది అనే ఆశ భావాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఇండియన్ టీమ్ ఇలా ఓడిపోవడం తో చాలా మంది ఏడ్చారు, మరి కొంతమంది అయితే ప్రాణాలు కూడా వదిలారు ఇక ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంది అంటే ఒక్కొక్కరు వాళ్ల ఆశలు మొత్తాన్ని టీం పైన పెట్టుకున్నారు ఇక వాళ్ల ప్రాణాలు కూడా కోల్పోయారంటే వరల్డ్ కప్ ఫైనల్ మనకు వస్తుందని వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు…

కానీ ఇండియన్ టీం ఇలా నిరాశపరచడమైతే కరెక్ట్ కాదు అంటూ ఇండియన్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక మన ఇండియాలో మన పిచ్ ల మీద ఆడుతూ కూడా ఆస్ట్రేలియా టీమ్ ని ఓడించలేదు అంటే మన ప్లేయర్ లను మనం ఏమనుకోవాలి అంటూ మరి కొంతమంది ఘాటు గా ప్రశ్నిస్తున్నారు.