Odi World Cup 2023: 2023 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం ఇప్పటికే వరుసగా ఐదు విజయాలను సొంతం చేసుకొని 10 పాయింట్ల తో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక న్యూజిలాండ్ టీమ్ కూడా వరుసగా 4 విజయాలను అందుకొని ఇండియా తో ఆడిన మ్యాచ్ లో గెలిచి నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుందాం అనే ప్రయత్నం చేసినప్పటికీ, న్యూజిలాండ్ టీం కి షాక్ ఇస్తూ ఇండియన్ ప్లేయర్లు ఆ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ని గెలిపించి నెంబర్ వన్ స్థానం లో కొనసాగేలా చేశారు.
ఇక దాంతో 8 పాయింట్లు తో న్యూజిలాండ్ టీమ్ నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతుంది. అయితే ఇండియన్ టీం ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకొని సెమిస్ లోకి వెళ్లాల్సింది. కానీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఏ టీమ్.ఎలా ఆడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు కాబట్టి ఇండియన్ టీం ఇంకా సెమిస్ కి అయితే క్వాలిఫై అవ్వలేదు.కాబట్టి ఇండియన్ టీం అఫీషియల్ గా సెమీస్ కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా ఒక మ్యాచ్ గెలవాలి అదే నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలంటే మాత్రం ఇంకా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించాల్సి ఉంది.
లాస్ట్ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీం ఐదు విజయాలను అందుకున్న కూడా సెమిస్ కి చేరుకుంది కారణం ఏంటి అంటే అప్పుడు న్యూజిలాండ్ టీమ్ 10 పాయింట్లను సంపాదించినప్పటికీ వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు అవ్వడంతో ఆ టీం కి అదనంగా ఒక పాయింట్ అనేది రావడం జరిగింది.ఇక దాంతో పాటుగా నెట్ రన్ రేట్ మిగిలిన టీం లతో పోల్చుకుంటే మెరుగ్గా ఉండడంతో ఈ టీమ్ సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకొని నెంబర్ 4 పొజిషన్ లో న్యూజిలాండ్ సెమీస్ కి అయితే చేరుకుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే పాకిస్థాన్ కూడా 5 విజయాలతో ఉంది అదనం గా ఒక పాయింట్ తో ఉన్నప్పటికీ రెండు టీములు కూడా సేమ్ పొజిషన్ లో ఉండటం తో సెమీస్ లో చోటు సంపాదించుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ పాక్ కి నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల న్యూజిలాండ్ సెమీస్ కి వెళ్తే , పాకిస్తాన్ మాత్రం ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఈ టోర్నీలో నెట్ రన్ రేట్ కూడా కీలకపాత్ర వహించబోతుందని తెలుస్తుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాచ్ రద్దు అవ్వడం గాని,మ్యాచులు టై అవ్వడం లాంటివి లేకపోవడం వల్ల మ్యాచ్ లు ఎక్కువగా గెలిచిన టీములు మాత్రమే సెమీస్ లోకి అడుగుపెడతాయి. అది కూడా రన్ రేట్ ని బేస్ చేసుకొని మాత్రమే సెమిస్ లోకి చేరుకుంటాయి అంతేతప్ప. అంతకుమించి ఏమీ లేదనే చెప్పాలి…
ఇక ఇండియన్ టీం వరుసగా అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో, నవంబర్ 2న శ్రీలంకతో, నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో, అలాగే ఇక చివరిగా నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో ఒక మ్యాచ్ లో తలపడనుంది.వీటిలో ఒక మ్యాచ్ గెలిస్తే సెమీస్ కి వెళ్తుంది.అదే రెండు మ్యాచ్ లు గెలిస్తే ఇండియా ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్తుంది.
ఇక నాలుగు మ్యాచ్ ల్లో రెండు విజయాలను సొంతం చేసుకోవడం ఇండియాకి పెద్ద విషయమైతే కాదు.ఎందుకంటే ఇప్పటికే ఇండియన్ టీం మంచి ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ లాంటి భారీ జట్టును ఓడించి మంచి ఫామ్ ని కొనసాగిస్తూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది.కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఇండియన్ టీం ని ఓడించే టీం వరల్డ్ కప్ లో లేదనే చెప్పాలి…