Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 25న బుధవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. ఈ క్రమంలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఆర్థికపరంగా సానుకూల ఫలితాలు. కటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మధ్యాహ్నం నుంచి అంకిత భావంతో పనిచేస్తారు. మతపరమైన కార్యక్రమాల్లోపాల్గొంటారు.
వృషభం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. అయినా ధైర్యంగా ముందుకు వెళ్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బిజీ కారణంగా కటుంబ సభ్యులతో గడపలేరు.
మిథునం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒకరి కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు పెట్టుబడులకు అనుకూల సమయం. దగ్గరి వారైనా ఇంటి విషయాలను ఇతరులకు చెప్పకుండా ఉండడమే మంచిది.
కర్కాటకం:
ఉద్యోగకులను అనుకూల సమయం. ఇబ్బందులు ఎన్ని ఉన్నా పరిష్కరించుకోగలుగుతారు. కొందరు పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీంతో అవి ఇబ్బందులు తెచ్చిపెడుతాయి. మీ మాట విధానంతో ఇతరుల నుంచి గౌరవం పొందుతారు.
సింహం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, బంధవ్యాలు పెరుగుతాయి. కొన్ని విషయాల్లో విచిత్రంగా ప్రవర్తిస్తారు. శ్రమకు తగిన ప్రయోజనాలు పొందుతారు.
కన్య:
ఈరోజు వీరికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. మంచిగా మాట్లాడినా ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కవాల్సి వస్తుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తే ఉన్న ఆదాయం పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తుల:
ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. కొత్త ఒప్పందాలను ఏర్పరుచుకుంటారు. స్నేహితులు, బంధువుల వల్ల కొంత ఇబ్బందులకు గురవుతారు. మనసులోని రహస్యాలు ఎవరికీ చెప్పకుండా ఉండడమేమంచిది.
వృశ్చికం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు.. దీంతో కొన్ని ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ధనస్సు:
ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం మీదే ఉంటుంది. సామాజిక రంగంలో గౌరవం పెరుగుతుంది. దూర ప్రయాణాలకు దూరంగా ఉండడమే మేలు.
మకరం:
ఎవరితోనైనా మీ భావాలను వ్యక్త పరిచేందుకు వెనుకాడుతారు. ఆర్థిక లాభాలు ఉండే అవకాశం. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది.
కుంభం:
కొత్త పనులను ఇప్పుడే ప్రారంభించొద్దు. అనుకున్న లాభాలు రాకపోయేసరికి నిరాశ ఎదురవుతుంది. పెండింగ్ పనులపై ఫోకస్ పెట్ాలి. ఇతర వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల తో విభేదాలు ఉంటాయి.
మీనం:
కొత్త పనులు చేపడుతారు. అయితే వీటిలో ఆటంకాలు ఏర్పడుతాయి. అయినా ముందుకు సాగుతారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి.