
How did former cricketer Mohammad Kaif utter Mahesh Babu’s dialogue?: సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారుండరు. టాలీవుడ్ లో అగ్రహీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు కేవలం తెలుగు తెరకే పరిచయం కాలేదు.. ఆయన గురించి బాలీవుడ్, హిందీ జనాలకు తెలుసు. జాతీయ స్థాయిలోనూ మహేష్ బాబును గుర్తించే వాళ్లు ఉన్నారు.
ప్రముఖ మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తాజాగా ఒక స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహేష్ బాబు క్రేజ్ గురించి జనాలు చెబితే వింటానని.. అతడి లుక్ , స్టైల్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా దూకుడు సినిమాలోని ‘మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ముందుకెళుతా’ అన్న డైలాగ్ ను యాంకర్ చెప్పగా.. యాజ్ టీజ్ అలాగే వల్లెవేశాడు. మహ్మద్ కైఫ్ పలికిన ఆ డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
https://twitter.com/GothamHero_/status/1435576657759244288?s=20