
Tollywood: టాలీవుడ్ లో బడా నిర్మాతలు, హీరోలు బయటకు ఓపెన్ గా చెప్పకపోయినా.. లోలోపల సినిమా టికెట్లు విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. మెగాస్టార్ కూడా తన ఆచార్య సినిమాని పోస్ట్ ఫోన్ చేయడానికి ప్రధాన కారణం..
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయని.. ఆ రేట్లుకు పెద్ద సినిమాలకు ఏ మాత్రం గిట్టుబాటు అవ్వదు అని.. ఇదే విషయాన్ని జగన్ కు చెప్పుకుని టికెట్లు ధరలు పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
కానీ ఆంద్రప్రదేశ్ లో ఇప్పటికే జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ లను కూడా రైల్వే టికెట్లు తరహాలో అమ్మాలి అని ప్రత్యేకంగా ఒక జీవో కూడా విడుదల చేసింది. రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో సినిమా టికెట్లుకు కూడా ఒక పోర్టల్‌ను తయారు చెయ్యాలని జగన్ ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుంది. పైగా జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ధరలను తగ్గించి.. దానికి తగ్గట్టుగా మరో జీవో కూడా జారీ చేసింది.
జగన్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత.. మళ్లీ ఇక ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అంటారు. మరి టికెట్లు రేట్లు విషయంలో కూడా జగన్ తన శైలిలోనే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ముందుకు పోతే పెద్ద సినిమాలకు భారీ నష్టాలు తప్పవు. ఆల్ రెడీ ఎప్పటి నుంచో ఈ తగ్గించిన రేట్లు తమకు ఏ మాత్రం గిట్టుబాటు కావని ఎగ్జిబిటర్లు ఆందోళన బాట పట్టారు. మరొక్క మెగాస్టార్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు కొందరు రెండు మీటింగ్ లు కూడా పెట్టారు.
ఆ మీటింగ్ లలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎలా ఒప్పించాలి ? ఏ విధంగా ముందుకు పోవాలి ? అని అందరూ కూర్చుని చర్చించారు. కాకపోతే.. ఈ లోపే జగన్ ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో పారదర్శకతను తెచ్చేందుకు టికెట్లు రేట్లు తగ్గించాం అని జీవోని జారీ చేసింది. ఈ జీవోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని కూడా క్లారిటీ ఇచ్చారు.
అయినా పారదర్శకత వస్తే మంచిదే, కాకపోతే.. ఆ పారదర్శకత కారణంగా ఎవరికి నష్టం జరగకూడదు. ఒకటి అయితే ఇక్కడ చాలా స్పష్టం అవుతోంది.. థియేటర్లపై ప్రభుత్వ పెత్తనం చెలాయించేందుకు అన్ని రకాలుగా పావులు కదుపుతోంది. మరి సినిమా పెద్దలు ఇప్పుడేం చేస్తారు ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా ఎదుర్కొంటుంది ? చూడాలి.