Rohit Sharma: ముంబై ఇండియన్స్ టీం కి ఇప్పటివరకు 5 సార్లు ఐపిఎల్ ట్రోఫీ ని అందించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక 2024 సీజన్ కోసం ముంబై ఇందియన్స్ టీమ్ కెప్టెన్ గా ఆయన్ని పదవి బాధ్యతల నుంచి తొలగించి హార్థిక్ పాండ్యకి కెప్టెన్ గా భాద్యతలను అప్పగించడం పట్ల రోహిత్ శర్మ ఫాన్స్ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మని తప్పించి హార్దిక్ పాండ్య ని ఎలా కెప్టెన్ గా తీసుకుంటారు అంటూ ముంబై ఇండియాన్స్ టీమ్ పైన తీవ్రమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రోహిత్ శర్మ టీం కి 5 సార్లు కప్ అందించాడు. అలాంటి రోహిత్ శర్మని సడన్ గా పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికి నిన్న ముంబై ఇండియన్స్ టీం అధికారికంగా రోహిత్ శర్మని తొలగిస్తూ హార్దిక్ పాండ్య ని 2024 సీజన్ నుంచి కెప్టెన్ గా తొలగించినట్లు గా తెలియజేసింది. ఇక అప్పటినుంచి ముంబై ఇండియన్స్ టీం కి ఎక్స్ (x)లో ఫాలోవర్స్ 4 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో 2 లక్షల మంది అన్ ఫాలో చేశారు.
ఇక దీంతో ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఐపిఎల్ ఫ్రాంచైజ్ గా చెన్నై సూపర్ కింగ్స్ 13 మిలియన్ల ఫాలోవర్స్ తో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక రోహిత్ శర్మ లేకపోతే ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ అనేది భారీగా పడిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు… ఇక రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం లోనే ప్లేయర్ గా కొనసాగుతాడా లేదా వేరే ఫ్రాంచైజ్ లకి వెళ్లి ఆ టీమ్ లకి కెప్టెన్ గా భాద్యతలను కొనసాగిస్తాడా అనే విషయాల మీద కూడా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి.
ఇక రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ ని తీసుకోవడానికి చాలా టీమ్ లు ఆసక్తిని చూపిస్తున్నాయి. మరి ఆ టీమ్ ల్లోకి వెళ్లి తన సత్తాను ప్రూవ్ చేసుకుంటాడా ముంబై ఇండియన్స్ టీమ్ లోనే ప్లేయర్ గా కొనసాగుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక డిసెంబర్ 19వ తేదీన మినీ ఆక్షన్ జరగనున్న నేపథ్యంలో అది ముగిసిన తర్వాత కూడా ట్రేడింగ్ విధానం ద్వారా తను అనుకున్న టీమ్ లోకి వెళ్లిపోవచ్చు. ఒకవేళ రోహిత్ శర్మ తను అనుకున్నట్టుగానే వేరే టీం లోకి వెళ్లి కప్పు కొట్టి చూపించినట్టయితే ముంబై ఇండియన్స్ టీం పరువు మొత్తం పోతుందంటూ తన అభిమానులు రోహిత్ శర్మ కి సపోర్టుగా మాట్లాడుతూనే ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ వేరే టీమ్ లోకి వెళ్లాలని చెప్తున్నారు. ఇక సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ జరుగుతుంది… మరి రోహిత్ శర్మ ఎలాంటి డిసిజన్ తీసుకోబోతున్నాడో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే…