Tilak Varma: 2023 ఐపీఎల్ 16వ సీజన్ లో తన బ్యాటింగ్ సత్తా చూపించి మంచి మార్కులు కొట్టేసిన తెలుగు అబ్బాయి తిలక్ వర్మ. వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్లలో టీమిండియా తరఫున ఇరగదీస్తున్నాడు తిలక్. అతను అద్భుతంగా రాణిస్తున్న తీరు చూసి భారత్ ఆశా కిరణంగా పలువురు అతన్ని ప్రస్తుతం ప్రశంసిస్తున్నారు. రీసెంట్ గా ఈ యువ సంచలనం గురించి అతని తండ్రి నంబూరి నాగరాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలో తిలక్ వర్మకు ఉన్న ఒక అలవాటు గురించి అతని తండ్రి చెప్పిన మాటలు అందరినీ షాక్ కి గురి చేశాయి. వెస్టిండీస్ లో జరుగుతున్న మ్యాచ్ పుణ్యమా అని ప్రస్తుతం ఎక్కడ చూసినా తిలక్ వర్మ గురించి బాగా చర్చ జరుగుతుంది. అతనికి సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. అందుకే ఇప్పుడు తిలక్ వర్మ గురించి అతని తండ్రి షేర్ చేసుకున్న మాటలను కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తిలక్ వర్మకున్న అలవాటు గురించి తెలుసుకొని అందరూ ఔరా..! చిన్నప్పటి నుంచే ఈ అలవాటు ఉందా.. అని ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ అలవాటు ఏదో కాదండి.. మామూలుగా చిన్న పిల్లలు పడుకునేటప్పుడు పక్కన ఏ టెడ్డీబేరో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే తిలక్ మాత్రం రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఎప్పుడు బ్యాట్ పట్టుకొని పడుకునే వాడట. తిలక్ ఇంట్రెస్ట్ కాదనలేక అతనికి ఓ ప్లాస్టిక్ బ్యాట్ కొనివ్వడంతో దాంతో రోజంతా ఆడుకొని నైట్ అది చేతిలో పట్టుకొని నిద్రపోయే వాడట. ఇక కాస్త పెద్ద అయిన తర్వాత ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడు తన పక్కన బ్యాట్, బాలు పెట్టుకొని పడుకోవడం తిలక్‌కు ఒక అలవాటుగా మారిందట.
అంతేకాకుండా తిలక్ వర్మ ఫస్ట్ కోచ్ గురించి కూడా ఆయన తండ్రి ప్రస్తావించడం జరిగింది. తిలక్‌కు క్రికెట్లో ఓనమాలు నేర్పించిన సలాం బయాశ్, తిలక్ వర్మను ఎంతగానో ప్రోత్సహించారు. మొదటిసారి బార్కాస్ మైదానంలో టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడుతున్న తిలక్ ని చూసిన సలాం అతనిలోని ప్రతిభను గుర్తించారు. కోచింగ్ ఎక్కడ తీసుకుంటున్నావ్ అని అడిగినప్పుడు తిలక్ తను గ్రౌండ్లో మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలియపరిచాడు. వెంటనే అతని తండ్రికి ఫోన్ చేసిన కోచ్ తిలక్‌ను తన అకాడమీలో చేర్చవలసిందిగా అభ్యర్థించారు
అయితే అప్పటికి తిలక్ తండ్రి ఒక ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న కారణంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. కానీ తిలక్ లాంటి టాలెంటెడ్ పర్సన్ ని వదులుకోవడం ఇష్టం లేని సలాం బయాష్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో సహా తానే భరిస్తానని ఫీజు కూడా అక్కర్లేదని చెప్పి అంగీకరించేలా చేశారు. నిజానికి సలాం బయాష్ లాంటి కోచ్ లేకపోతే ఈరోజు ఇంత దూరం రాగలిగే వాడు కాదు అని ఆయన తండ్రి అన్నారు.
తిలక్‌ను ఎంతో ఇష్టంగా చూసుకునే అతని కోచ్ లంచ్ బాక్స్ తో సహా తిలక్ తో షేర్ చేసుకునే వాడట. మీకు ఏదైనా సమస్య ఉన్నా నాకు చెప్పండి నేను ఉన్నాను అన్న భరోసా ఇచ్చేవాడని తిలక్ తండ్రి పేర్కొన్నారు. దేశవాళి ఆటలలో పరుగుల వర్షం కురిపించిన తిలక్ క్రమంగా ఐపీఎల్ ఫ్రాంచైజ్లను కూడా ఆకర్షించాడు. దీంతో అతని కెరియర్ కాస్త కుదుటపడింది. ఇంతకుముందు జరిగిన ముంబై ఇండియన్స్ మినీ వేలంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బాటర్ రూ. 1.7 కోట్లు పలికాడు. ఆ సీజన్లో అదరగొట్టే పర్ఫామెన్స్ చూపించి చెలరేగిపోయాడు. బాగా రాణించడంతో భారత్ సెలెక్టర్ల దృష్టి తిలక్ పై పడింది.. కాబట్టి వెండి టీ20 సిరీస్ కు ఎంపిక కాగలిగాడు. అతను తన వాడి వేడి ఇదే రకంగా కొనసాగిస్తూ…మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవడంతోపాటు భారత్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాడు అని అందరూ ఆశిస్తున్నారు.