Paris Para Olampics 2024 : పారిస్ పారాలింపిక్స్ ఆగస్ట్ 28, బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఫ్రెంచ్ రాజధానిలో 11 రోజుల పాటు క్రీడలు జరగనున్నాయి. బుధవారం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అతిరథులు, ప్రముఖులు ప్రారంభ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇక గురువారం నుంచి రెగ్యులర్ క్రీడా పోటీలు ప్రారంభం అవుతాయి. 84 మంది అథ్లెట్లతో కూడిన అత్యున్నత బృందాన్ని భారత్ పారా ఒలింపిక్స్ లోకి దింపింది. 2021 టోక్యో పారా ఒలింపిక్స్ లో గెలుచుకున్న పతకాల కంటే ఎక్కువ గెలుచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో 19 పతకాల (5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు) ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. 1968 పారా ఒలింపిక్ క్రీడల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని క్రీడల్లో కలిపి మొత్తం 12 పతకాలు దక్కాయి. F64 కేటగిరీలో పారా జావెలిన్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సుమిత్ అంటిల్ సెప్టెంబర్ 2న టోక్యో ఒలింపిక్స్ స్వర్ణాన్ని కాపాడుకోనున్నాడు. అవని లేఖా (పారా షూటింగ్), మనీష్ నర్వాల్ (పారా షూటింగ్), కృష్ణ నాగర్ (పారా బ్యాడ్మింటన్) కూడా ఈ ఈ క్రీడలలో తమ టైటిళ్లను కాపాడుకోనున్నారు.
ఆగస్ట్ 29, గురువారం- బ్యాడ్మింటన్
మిక్స్ డ్ డబుల్స్ గ్రూప్ దశ – మధ్యాహ్నం 12 గంటల నుంచి..
పురుషుల సింగిల్స్ గ్రూప్ దశ – మధ్యాహ్నం 12 గంటల నుంచి
మహిళల సింగిల్స్ గ్రూప్ దశ – మధ్యాహ్నం 12 గంటల నుంచి
స్విమ్మింగ్..: పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్ 10 – మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభం అవుతుంది.
టేబుల్ టెన్నిస్..: మహిళల డబుల్స్ – మధ్యాహ్నం 1.30 గంటల నుంచి
పురుషుల డబుల్స్ – మధ్యాహ్నం 1.30 గంటల నుంచి
మిక్స్ డ్ డబుల్స్ – మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
థైక్వాండో..: మహిళల కే 44-47 కిలోలు – మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
షూటింగ్..: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH 1 ప్రీ-ఈవెంట్ ట్రైనింగ్ – మధ్యాహ్నం 2:30 గంటలకు మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH2 ప్రీ-ఈవెంట్ ట్రైనింగ్ – సాయంత్రం 4 గంటలకు, పురుషుల10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ప్రీ-ఈవెంట్ ట్రైనింగ్ – సాయంత్రం5.45 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
పారా సైక్లింగ్..: మహిళల సీ1-3 3000 మీటర్ల వ్యక్తిగత పోటీ అర్హత సాయంత్రం 4.20 గంటల నుంచి.
పారా ఆర్చరీ..: మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ – సాయంత్రం 4:30 గంటలకు, పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ – సాయంత్రం 4:30 పురుషులకు, వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ – 8:30 మహిళలకు, వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభం అవుతుంది.
ఆగస్ట్ 30, శుక్రవారం
థైక్వాండో..: మహిళల కే44-47 కేజీల స్వర్ణ పతక పోటీ – 12.04 గంటలకు
పారా బ్యాడ్మింటన్..: మహిళల సింగిల్స్ గ్రూప్ దశ – మధ్యాహ్నం 12 గంటల నుంచి. పురుషుల సింగిల్స్ గ్రూప్ దశ – మధ్యాహ్నం 12 గంటల నుంచి
మిక్స్ డ్ డబుల్స్ గ్రూప్ దశ – రాత్రి 7:30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
పారా ఆర్చరీ..: మహిళల వ్యక్తి గత కాంపౌండ్ ఓపెన్ రౌండ్ 32 – మధ్యాహ్నం 12.30 గంటల నుంచి, పురుషుల వ్యక్తి గత కాంపౌండ్ ఓపెన్ రౌండ్ 32 – రాత్రి 7 గంటల నుంచి ఉంటుంది.
పారా షూటింగ్..: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 అర్హత – సాయంత్రం 12.30 గంటలకు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH 1 అర్హత – సాయంత్రం 2:30 గంటలకు, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఫైనల్ సాయంత్రం 3.15 గంటలకు.
మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH2 క్వాలిఫికేషన్ సాయంత్రం 5 గంటల నుంచి.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్ సాయంత్రం 5:30 గంటల నుంచి, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH 1 ఫైనల్ సాయంత్రం 5.30 గంటలకు ఉంటుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH2 ప్రీ ఈవెంట్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ప్రీ-ఈవెంట్ ట్రైనింగ్ – రాత్రి 8.30 గంటలన నుంచి ఉంటుంది.
మహిళల డిస్కస్ త్రో ఎఫ్-55 ఫైనల్..: 1.30 మహిళల 100 మీటర్ల T35 ఫైనల్ – సాయంత్రం4.39 గంటలకు ఉంటుంది.
టేబుల్ టెన్నిస్..: పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ – మధ్యాహ్నం 1.30 గంటల నుంచి. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి
మిక్స్ డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ మధ్యాహ్నం 1:30 నుంచి
పారా రోయింగ్..: మిక్స్ డ్ డబుల్స్ స్కల్స్ పీఆర్ 3 హీట్స్ మధ్యాహ్నం 3 గంటలకు.
సైక్లింగ్..: పురుషుల సీ2 3000 మీటర్ల వ్యక్తిగత అన్వేషణ 4.24 సాయంత్రం పురుషుల సీ 3000 మీటర్ల వ్యక్తిగత అన్వేషణ ఫైనల్ కాంస్యం 7.11 పురుషుల
సీ2 3000 మీటర్ల వ్యక్తిగత అన్వేషణ ఫైనల్ స్వర్ణం 7.19 సాయంత్రం ఉంటుంది.
ఆగస్టు 31, శనివారం
పురుషుల షాట్ పుట్ F37 ఫైనల్ ఉదయం 12.20 పురుషుల
జావెలిన్ త్రో F57 ఫైనల్ రాత్రి 10:30 గంటలకు ఉంటుంది.
పారా షూటింగ్
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 అర్హత మధ్యాహ్నం 1గంటకు,
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 అర్హత సాయంత్రం 3.30 గంటలకు,
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఫైనల్ సాయంత్రం 3.45 గంటలకు,
మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ SH2 ప్రీ ఈవెంట్ ట్రైనింగ్ సాయంత్రం 5:30 గంటలకు, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్ సాయంత్రం 6.15 ఉంటుంది.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్..: మహిళల C1-3 500 మీటర్ల టైమ్ ట్రయల్ క్వాలిఫైయింగ్ – మధ్యాహ్నం 1:30 గంటలకు, పురుషుల C1-3 1000 మీటర్ల టైమ్ ట్రయల్ క్వాలిఫైయింగ్ – సాయంత్రం 1:49 గంటలకు, మహిళల C1-3 500 మీటర్ల టైమ్ ట్రయల్ ఫైనల్ – సాయంత్రం 5:05 గంటలకు, పురుషుల C1-3 1000 మీటర్ల టైమ్ ట్రయల్ ఫైనల్ సాయంత్రం 5:32 గంటలకు ఉంటుంది.
టేబుల్ టెన్నిస్..: మహిళల డబుల్స్ WD 10 సెమీఫైనల్స్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి, మహిళల డబుల్స్ WD 10 గోల్డ్ మెడల్ మ్యాచ్ 10.45 గంటల నుంచి.
రోయింగ్..: మిక్స్ డ్ డబుల్స్ స్కల్స్ PR3 రిపెచేజ్ మధ్యాహ్నం 2.40గంటలకు.
పారా ఆర్చరీ..: మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ రౌండ్ 16 రాత్రి 7 గంటల నుంచి, మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ రాత్రి 9.16 గంటల నుంచి, మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ సెమీఫైనల్స్ 10.14 గంటల నుంచి
బ్యాడ్మింటన్..: మిక్స్ డ్ డబుల్స్ సెమీఫైనల్స్ రాత్రి 7.30 గంటల నుంచి ఉంటుంది.
సెప్టెంబర్ 1, ఆదివారం
బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ మధ్యాహ్నం 12 గంటల నుంచి
మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ మధ్యాహ్నం 12 గంటల నుంచి, ఫైనల్స్ మ్యాచ్ లు రాత్రి 10.10 గంటల నుంచి ఉంటాయి.
షూటింగ్..: మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ SH1 అర్హత మధ్యాహ్నం 1 గంటల నుంచి, మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ SH2 అర్హత సాయంత్రం 3 నుంచి, మిక్స్ డ్ 25 మీటర్ల పిస్టల్ SH1 ప్రీ- ఈవెంట్ ట్రైనింగ్ సాయంత్రం 4 గంటలకు, మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ SH2 ఫైనల్ – సాయంత్రం 6:30 గంటలకు ఉంటుంది.
అథ్లెటిక్స్..: మహిళల 1500 మీటర్ల T11 రౌండ్ 1 మధ్యాహ్నం 1.40 గంటలకు, పురుషుల షాట్ పుట్ F40 ఫైనల్ సాయంత్రం 3:09 గంటలకు,
పురుషుల హైజంప్ T47 ఫైనల్ సాయంత్రం 10:58 గంటలకు, మహిళల 200 మీటర్ల T35 ఫైనల్ రాత్రి 11.08 గంటలకు
రోయింగ్..: మిక్స్ డ్ డబుల్స్ స్కల్స్ PR3 ఫైనల్ బీ మధ్యాహ్నం 2 గంటలకు, మిక్స్ డ్ డబుల్స్ స్కల్స్ PR3 ఫైనల్ ఏ మధ్యాహ్నం 3:40 గంటలకు
పారా ఆర్చరీ..: పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ రౌండ్-16 త్రి 7 గంటల నుంచి, పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ రాత్రి 9.16 గంటల నుంచి, పురుషుల వ్యక్తి గత కాంపౌండ్ ఓపెన్ సెమీఫైనల్స్ రాత్రి 10.24 గంటల నుంచి, పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ కాంస్య పతక మ్యాచ్ – 11.13 గంటలకు పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ గోల్డ్ మెడల్ మ్యాచ్ 11.30 గంటల నుంచి ఉంటుంది.
టేబుల్ టెన్నిస్..: మహిళల సింగిల్స్ రౌండ్ 32 రాత్రి 10.30 గంటల నుంచి,
మహిళల సింగిల్స్ రౌండ్ 16 – 10.30 గంటల నుంచి ఉంటుంది.
సెప్టెంబర్ 2, సోమవారం
షూటింగ్..: మిక్స్ డ్ 25 మీటర్ల పిస్టల్ SH 1 మధ్యాహ్నం 12:30 గంటలకు,
మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాలు SH1 ప్రీ-ఈవెంట్ ట్రైనింగ్ మధ్యాహ్నం 12:30 గంటలకు,
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాలు SH1 ప్రీ-ఈవెంట్ ట్రైనింగ్ మధ్యాహ్నం 12.30 గంటలకు, మిక్స్ డ్ 25 మీటర్ల పిస్టల్ SH1 క్వాలిఫికేషన్ ర్యాపిడ్ సాయంత్రం 4:30 గంటలు నుంచి, మిక్స్ డ్ 25 మీటర్ల పిస్టల్ SH1 ఫైనల్ రాత్రి 8:15 గంటల నుంచి ఉంటుంది.
అథ్లెటిక్స్..
పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 ఫైనల్ మధ్యాహ్నం 1:35, మహిళల 1500 మీటర్ల టీ11 ఫైనల్ మధ్యాహ్నం 1.40 గంటలు, పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 64 ఫైనల్ రాత్రి 10.30 గంటలకు, మహిళల డిస్కస్ త్రో ఎఫ్53 ఫైనల్ సాయంత్రం 10.34 గంటలకు, మహిళల 400 మీటర్ల టీ20 రౌండ్ 1 సాయంత్రం 11:50 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
టేబుల్ టెన్నిస్..: మహిళల సింగిల్స్ రౌండ్ 32 మధ్యాహ్నం 1.30 గంటల నుంచి
మహిళల సింగిల్స్ రౌండ్ 16 – మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
ఆర్చరీ..: మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ రౌండ్ 16 రాత్రి 7.00 గంటల నుంచి,
మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ రాత్రి 8.20 గంటల నుంచి,
మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ సెమీఫైనల్స్ రాత్రి 9.40 గంటల నుంచి,
మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ కాంస్య పతక మ్యాచ్ 10.35 సాయంత్రం
మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ గోల్డ్ మెడల్ మ్యాచ్ రాత్రి 10.55 నుంచి ఉంటాయి.
బ్యాడ్మింటన్..: ఫైనల్స్ మ్యాచ్లు – రాత్రి 8 గంటల నుంచి
సెప్టెంబర్ 3, మంగళవారం
ఆర్చరీ..:
మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ రౌండ్ 32 – మధ్యాహ్నం 12.30 గంటల నుంచి,
మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ రౌండ్ 16 – మధ్యాహ్నం 12.30 గంటల నుంచి,
మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ – రాత్రి 8.30 గంటల నుంచి,
మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ సెమీఫైనల్స్ – రాత్రి 9.38 గంటల నుంచి
మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ కాంస్య పతక మ్యాచ్ – రాత్రి 10:27 మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ గోల్డ్ మెడల్ మ్యాచ్ – సాయంత్రం 10:27 గంటల నుంచి ఉంటుంది.
మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ గోల్డ్ మెడల్ మ్యాచ్
మహిళల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 స్థానాలు SH 1 అర్హత రాత్రి 1 గంటల నుంచి,
పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 స్థానాలు SH 1 అర్హత రాత్రి 1 గంటల నుంచి,
మిక్స్ డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ SH2 ప్రీ-ఈవెంట్ ట్రైనింగ్ – సాయంత్రం 4:15 గంటల నుంచి,
మిక్స్ డ్ 50 మీటర్ల పిస్టల్ SH 1 ప్రీ-ఈవెంట్ ట్రైనింగ్ – సాయంత్రం 6:00,
మహిళల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 స్థానాలు SH 1 ఫైనల్ – రాతరి 7:30 గంటలకు.
మహిళల షాట్ పుట్ ఎఫ్ 34 ఫైనల్
మధ్యాహ్నం 2:26 మహిళల 400 మీటర్ల T 20 ఫైనల్ రాత్రి 10:38 గంటలకు, పురుషుల హైజంప్ T 63 ఫైనల్ రాత్రి 11:40 ఉంటుంది.
టేబుల్ టెన్నిస్..:
మహిళల సింగిల్స్ రౌండ్ 16/క్వార్టర్ ఫైనల్స్/సెమీఫైనల్స్ – మధ్యాహ్నం 1:30 గంటల నుంచి,
పురుషుల సింగిల్స్ రౌండ్ 16/క్వార్టర్ ఫైనల్స్/సెమీఫైనల్స్ – మధ్యాహ్నం 1:30 నుంచి
సెప్టెంబర్ 4, బుధవారం
పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 46 ఫైనల్ – 12.10 గంటలకు పురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 ఫైనల్ – మధ్యాహ్నం 1:35 గంటలకు, మహిళల షాట్ పుట్ ఎఫ్ 46 ఫైనల్ సాయంత్రం 3:16 గంటలకు, పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 ఫైనల్ రాత్రి 10:50 గంటల నుంచి, మహిళల 100 మీటర్ల టీ12 రౌండ్ 1 రాత్రి 11 గంటల నుంచి.
సైక్లింగ్..: మహిళల సీ1-3 రోడ్ టైమ్ ట్రయల్ – ఉదయం 11:30 గంటల నుంచి
ఆర్చరీ..: పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ రౌండ్ 32 – మధ్యాహ్నం 12:30 గంటల నుంచి
పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ రౌండ్ 16 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి,
పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ రాత్రి 9 గంటల నుంచి,
పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ సెమీఫైనల్స్ రాత్రి 10.08 గంటల నుంచి,
పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ కాంస్య పతక మ్యాచ్ రాత్రి 10.54 గంటల నుంచి, పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ కాంస్య పతక మ్యాచ్ రాత్రి 10.54 గంటల నుంచి, పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ గోల్డ్ మెడల్ మ్యాచ్ రాత్రి 10:54 గంటల నుంచి.
పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ గోల్డ్ మెడల్ మ్యాచ్
మిక్స్ డ్ 50 మీటర్ల పిస్టల్ SH1 క్వాలిఫికేషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి,
మిక్స్ డ్ 50 మీటర్ల పిస్టల్ SH1 ఫైనల్ మధ్యాహ్నం 3:45 గంటల నుంచి,
మిక్స్ డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ SH2 సాయంత్రం 4:00 గంటల నుంచి,
మిక్స్ డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ SH1 ప్రీ-ఈవెంట్ ట్రైనింగ్ – సాయంత్రం 5:30 గంటల నుంచి,
మిక్స్ డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ SH2 ఫైనల్ సాయంత్రం 6:30 గంటల నుంచి.
టేబుల్ టెన్నిస్..:
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్/సెమీఫైనల్స్/ఫైనల్స్ – మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
పవర్ లిఫ్టింగ్..: పురుషుల 49 కేజీల ఫైనల్ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి, మహిళల 45 కేజీల పవర్ లిఫ్టింగ్ ఉంటుంది.
ఆగస్టు 5, గురువారం
షూటింగ్..: మిక్స్ డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ SH1 క్వాలిఫికేషన్ – మధ్యాహ్నం మధ్యాహ్నం 1 గంట నుంచి,
మిక్స్ డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ SH1 ఫైనల్ మధ్యాహ్నం 3:15 గంటల నుంచి.
మహిళల 100 మీటర్ల టీ12 సెమీఫైనల్స్ – మధ్యాహ్నం 3.10 గంటలకు
మహిళల 100 మీటర్ల టీ12 ఫైనల్ రాత్రి10.47 గంటలకు,
పురుషుల షాట్ పుట్ ఎఫ్ 35 ఫైనల్ రాత్రి 11.49 గంటల నుంచి ఉంటుంది.
జూడో..: మహిళల 48 కిలోల ప్రిలిమినరీ రౌండ్లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి. పురుషుల 60 కిలోల ప్రిలిమినరీ రౌండ్లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి, మహిళల 48 కిలోల ఫైనల్స్ రాత్రి 7:30 గంటల నుంచి, పురుషుల 48 కిలోల ఫైనల్స్ సాయంత్రం 7:30 గంటల నుంచి ఉంటుంది.
ఆర్చరీ..: మిక్స్ డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ – సాయంత్రం 6:30 గంటల నుంచి, మిక్స్ డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ సెమీఫైనల్స్ – రాత్రి 7:50 గంటల నుంచి, మిక్స్ డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ కాంస్య పతక మ్యాచ్ రాత్రి 8:45
మిక్స్ డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ గోల్డ్ మెడల్ మ్యాచ్ రాత్రి 9.05 గంటలకు ఉంటుంది.
పవర్ లిఫ్టింగ్..: పురుషుల 65 కిలోల ఫైనల్ – రాత్రి 10.02 గంటలకు ఉంటాయి.
ఆగస్టు 6, శుక్రవారం
మహిళల 200 మీటర్ల T12 రౌండ్ 1 మధ్యాహ్నం 1.39 గంటల నుంచి,
పురుషుల జావెలిన్ త్రో F54 ఫైనల్ మధ్యాహ్నం 2.08 గంటల నుంచి,
పురుషుల 400 మీటర్ల T47 రౌండ్ 1 సాయంత్రం 2:47 గంటల నుంచి,
పురుషుల హైజంప్ T64 ఫైనల్ సాయంత్రం 3:18 గంటల నుంచి,
పురుషుల షాట్ పుట్ F57 ఫైనల్ రాత్రి 10.30 గంటల నుంచి,
మహిళల జావెలిన్ త్రో F46 ఫైనల్ రాత్రి 10.30 గంటల నుంచి,
మహిళల జావెలిన్ త్రో F46 ఫైనల్ రాత్రి 10.30 గంటల నుంచి ఉంటుంది.
పురుషుల కయాక్ సింగిల్ కేఎల్ 1 200 మీటర్ల హీట్స్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి,
మహిళల వా సింగిల్ వీఎల్ 2 200 మీటర్ల హీట్స్ మధ్యాహ్నం 1.50 గంటల నుంచి,
కయాక్ సింగిల్ కేఎల్ 1 200 మీటర్ల హీట్స్ మధ్యాహ్నం 2:55 గంటల నుంచి ఉంటుంది.
టేబుల్ టెన్నిస్..: మహిళల సింగిల్స్ WS 3 సెమీ ఫైనల్స్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి,
మహిళల సింగిల్స్ WS 3 స్వర్ణ పతక మ్యాచ్ 11.45 గంటల నుంచి ఉంటుంది.
పవర్ లిఫ్టింగ్..: మహిళల 67 కేజీల ఫైనల్ రాత్రి 8:30 గంటలకు ఉంటుంది.
సెప్టెంబర్ 7, శనివారం
సైక్లింగ్..: మహిళల C1-3 రోడ్ రేస్ మధ్యాహ్నం 1 పురుషుల C1-3 రోడ్ రేస్ మధ్యాహ్నం ఒంటి గంటకు ఉంటుంది.
కెనో..: పురుషుల కయాక్ సింగిల్ KL 1 200 మీటర్ల సెమీఫైనల్స్ మధ్యాహ్నం 1.30 గంటలకు,
మహిళల వా సింగిల్ VL 2 200 మీటర్ల సెమీ ఫైనల్స్ మధ్యాహ్నం 1.58 గంటలకు,
పురుషుల కయాక్ సింగిల్ KL 1 200 మీటర్ల ఫైనల్ ఏ – మధ్యాహ్నం 2.50 గంటలకు,
మహిళల వాయా సింగిల్ VL 2 200 మీటర్ల ఫైనల్ బీ – సాయంత్రం 3.14 మహిళల మహిళల Va 2 200 మీటర్ల ఫైనల్ ఏ- సాయంత్రం 3.22 గంటలకు ఉంటుంది.
టేబుల్ టెన్నీస్..: మహిళల సింగిల్స్ WS 4 సెమీఫైనల్స్ – మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
మహిళల సింగిల్స్ WS 4 స్వర్ణ పతక మ్యాచ్ – రాత్రి 9:30 గంటలకు ఉంటుంది.
పురుషుల జావెలిన్ త్రో F 41 ఫైనల్ – రాత్రి 10:30 గంటల నుంచి,
మహిళల 200 మీటర్ల T12 ఫైనల్ – రాత్రి 11:03 గంటల నుంచి.
సెప్టెంబర్ 8, ఆదివారం
క్యానో..: మహిళల కయాక్ సింగిల్ KL 1 200 మీటర్ల సెమీ ఫైనల్స్ – మధ్యాహ్నం 1:30 గంటలకు,
కయాక్ సింగిల్ KL 1 200 మీటర్ల ఫైనల్ ఏ – మధ్యాహ్నం 2:55 గంటలు
సెప్టెంబర్ 9, సోమవారం
ముగింపు వేడుక – అర్ధరాత్రి 12:30 గంటలకు ఉంటుంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Here is indias complete schedule for paris 2024 paralympics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com