Abhishek Sharma and Vaibhav Suryavanshi: సలార్ సినిమా చూశారా.. అందులో ఓ పాటలో.. ఒకడు ఉప్పెన.. ఇంకొకడు గర్జన అంటూ ఒక చరణం ఉంటుంది. ఆ చరణం టీమిండియాలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్య వంశీకి నూటికి నూరుపాళ్లు సరిపోతుంది.. మామూలుగానే వీరిద్దరూ ఒక టెంపర్ లో ఉంటారు. అలాంటిది తమకు నచ్చిన వేదిక.. నచ్చిన విధంగా బంతులు పడుతుంటే ఎలా ఊరుకుంటారు.. ప్రస్తుతం వీరిద్దరూ అదే చేస్తున్నారు.
టీమిండియా ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతోంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్లను గెలిచింది. సూపర్ ఫోర్ లో కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ద్వారా మరోసారి ట్రోఫీని అందుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. టీమిండియాలో అందరూ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. దూకుడుకు పర్యాయపదంగా ఆడుతున్నాడు. విధ్వంసానికి పరాకాష్టగా నిలుస్తున్నాడు. అతని ఆట తీరు తోటి ఆటగాళ్లనే కాదు.. ప్రత్యర్ధులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో అభిషేక్ శర్మ మైదానంలో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. పాకిస్తాన్ విధించిన 170 పరుగులకు పైగా లక్ష్యాన్ని సులువుగా ఫినిష్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్లకు నిద్రలేని రాత్రులను పరిచయం చేశాడు. అతని బ్యాటింగ్ దూకుడు తట్టుకోలేక పాకిస్తాన్ బౌలర్లు గొడవకు దిగారు. అయినప్పటికీ అతడు తన బ్యాట్ ద్వారానే సమాధానం చెప్పాడు. గిల్ తో కలిసి తొలి వికెట్ కు శతక భాగస్వామ్యం నమోదు చేశాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే సిక్సర్ కొట్టి.. తన ఉద్దేశం ఏమిటో చాటి చెప్పాడు అభిషేక్. ఆ తర్వాత ఏమాత్రం పాకిస్తాన్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఇన్నింగ్స్ ద్వారా అభిషేక్ శర్మ ఒక్కసారిగా సూపర్ హీరో అయిపోయాడు.
అభిషేక్ శర్మ మాదిరిగానే సూర్యవంశీ కూడా అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న సిరీస్లో దుమ్ము రేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డమీదపై ఎదురనేది లేకుండా సాగిపోతున్నాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో సూర్య వంశీ 22 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సూర్య వంశీ తో పాటు అభిగ్యాన్ కుందు 87*, వేదాంత త్రివేది 61* అదరగొట్టారు. తద్వారా భారత్ ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 225 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 30.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. వైభవ్ అదరగొట్టిన నేపథ్యంలో.. అతడి ఇన్నింగ్స్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ను సరిపోల్చుతూ సోషల్ మీడియాలో భారత అభిమానులు ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆడితే టీమ్ ఇండియాకు తిరుగులేదని వ్యాఖ్యానిస్తున్నారు.
Vaibhav Suryavanshi’s first game in Australia was seriously entertaining
Highlights: https://t.co/hfQabdpRwD pic.twitter.com/TdGijK0ZpG
— cricket.com.au (@cricketcomau) September 22, 2025