Mahesh Babu next film details: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు లాంటి స్టార్ హీరో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది. తద్వారా ఈ సినిమాతో వీళ్లు ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందనే ఉద్దేశ్యంతోనే ప్రేక్షకులు సైతం ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినీ 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందనే అంచనాలో మేకర్స్ అయితే ఉన్నారు. అయితే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. నిర్మాత సునీల్ నారంగ్ సందీప్ రెడ్డి వంగకి అడ్వాన్స్ ఇచ్చాడు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్లోనే మహేష్ బాబుతో సినిమా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా సునీల్ నారంగ్ ఈ విషయాల పైన స్పందిస్తూ మహేష్ బాబు – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో సినిమా వస్తోంది అనేది అవాస్తవం…
ఎందుకంటే మేము అసలు మహేష్ బాబు తో ప్లానింగ్ ఏం చేయడం లేదు. మహేష్ బాబు నాతో ఏఏంబి బిజినెస్ పార్ట్నర్ తప్ప సినిమాకు సంబంధించిన విషయాలను మేము ఏమి చర్చించుకోలేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. దీంతో మహేష్ బాబు అభిమానులు కొంత వరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి.
ఇక సందీప్ రెడ్డివంగ సునీల్ నారంగ్ కాంబినేషన్లో వచ్చే సినిమాకి హీరో ఎవరు అనేది కూడా ఆయన క్లారిటి ఇవ్వలేకపోయారు. మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగ గతంలో మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నానని దానికి డెవిల్ అయిన టైటిల్ బాగుంటుందని క్లారిటీ అయితే ఇచ్చాడు. మరి మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చే సినిమా పూర్తి వైలెన్స్ తో ఉండబోతోంది.
మరి అంత వైలెన్స్ ని మహేష్ బాబు ఒప్పుకోలేడు కాబట్టే ఆతనతో వింక ఉంటుందా లేదా అనేది చెప్పడం కష్టం అంటూ కొంత మంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం…సందీప్ రెడ్డివంగా – మహేష్ బాబు కాంబినేషన్ కి బ్రేక్ పడింది. కాబట్టి తన తదుపరి సినిమాని ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ తో గాని లేదంటే అల్లు అర్జున్ తో గాని సందీప్ రెడ్డివంగ సినిమా ఉండబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి…