Heinrich Klaasen Century : అభిషేక్ శర్మ 32, హెడ్ 76 పరుగులతో కదం తొక్కడంతో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా ప్రయాణం సాగిస్తోంది.. ఈ సీజన్లో ప్రారంభ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుపై దుమ్మురేపిన హైదరాబాద్ ఆటగాళ్లు.. మళ్లీ ఆ స్థాయిలో అదరగొట్టలేకపోయారు. కానీ కోల్ కతా జట్టు తో జరుగుతున్న చివరి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సీజన్లో చివర్ మ్యాచ్లో 300 పరుగులు చేసేలాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా క్లాసెన్ చేసిన సెంచరీ ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఎందుకంటే అతడు ఇప్పటివరకు తన స్థాయి ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడ లేక పోయాడు. గత సీజన్లో అతడు అద్భుతాలు చేసినప్పటికీ.. ఈ సీజన్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో అతడు వన్ డౌన్ ఆటగాడిగా రంగంలోకి వచ్చాడు. మొత్తానికి తన సత్తా చూపించాడు. తనను రిటైన్ చేసుకున్న కావ్యకు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. ఫోర్లు కొట్టి.. సిక్సర్లతో సింహతాండవం చేసి అదరగొట్టాడు. క్లాసెన్ సెంచరీలో ఆరు ఫోర్లు ఉంటే.. సిక్సర్లు 9 ఉన్నాయి అంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని రోజులపాటు జరిగిన మ్యాచ్లలో తనను వన్ డౌన్ గా పంపించి ఉంటే ఎలాంటి ఫలితాలు వచ్చేవో క్లాసెన్ తన బ్యాటింగ్ ద్వారా నిరూపించాడు. ఏ ఒక్క కోల్ కతా బౌలర్ ని కూడా వదిలిపెట్టకుండా బ్యాటింగ్ చేశాడు క్లాసెన్. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. సెంచరీ చేయడానికి కొద్ది బంతులు ఎక్కువగానే తీసుకున్నప్పటికీ.. చేయాల్సిన లక్ష్యాన్ని పూర్తి చేశాడు.
సొంతమైదానంలో ఢిల్లీ జట్టు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. కానీ హైదరాబాద్ ఆటగాళ్లు మాత్రం అసలు సిసలైన క్రికెట్ వినోదాన్ని అందించారు. ఢిల్లీ అభిమానులు తమకు జేజేలు కొట్టేలాగా హైదరాబాద్ ఆటగాళ్లు చేసుకున్నారు. ఫోర్లు.. సిక్సర్లు కొడుతూ తమను ఎందుకు కాటిరమ్మ కొడుకులు అని పిలుస్తారో మరొకసారి నిరూపించారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత క్లాసెన్ ఫామ్ లోకి రావడం హైదరాబాద్ జట్టుకు శుభ సూచకం లాగా కనిపిస్తోంది. ఇటీవల కిషన్ సెంచరీ దాకా వచ్చినప్పటికీ.. దానిని నెరవేర్చుకోలేకపోయాడు. ఆ లోటును మొత్తానికి క్లాసెన్ భర్తీ చేశాడు.
Every time he swings, you know it’s travelling!
Heinrich Klaasen | #PlayWithFire | #SRHvKKR | #TATAIPL2025 pic.twitter.com/XoB9HKa48y
— SunRisers Hyderabad (@SunRisers) May 25, 2025