Hazlewood : ప్రస్తుతం భారత్ – పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కొంతమేర తగ్గినప్పటికీ.. రాజకీయంగా మాత్రం అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే తప్పుడు సోషల్ మీడియా సందేశాల పరంపర సాగుతూనే ఉంది. దీనివల్ల సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే విషయాలలో ఏది నిజమో? ఏది అబద్దమో అర్థం కావడం లేదు. ఇలాంటి అబద్ధపు వార్తల బారిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్ వుడ్ పడ్డాడు. అంతేకాదు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే హేజిల్ వుడ్ పేరు మీద తప్పుడు వార్తలు ప్రసారం కావడంతో అతడు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయ్యాడు. పైగా అతడు చేసిన వ్యాఖ్యలు ఇండియన్ ఆర్మీకి అనుకూలంగా.. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉండడంతో హేజిల్ వుడ్ వ్యక్తిగత సిబ్బంది కల్పించుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు యాజమాన్యం కూడా రెస్పాండ్ కావాల్సి వచ్చింది.. హేజిల్ వుడ్ చేసిన కామెంట్స్ సంచలనం కావడంతో.. ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని చూపించారు.
Also Read : భయం పేరుతో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ నాటకం.. దాని వెనుక అసలు నిజం ఇదీ!
ఇటీవల ఉగ్రవాద దేశం పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సిందూర్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మ్యాచ్లు టెంపరరీగా ఆగిపోయాయి. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఐపీఎల్ టెంపరరీగా ఆగిపోవడంతో ఫారిన్ ప్లేయర్లు మొత్తం వారి వారి సొంత దేశాలకు వెళ్లిపోయారు. ఇందులో ఆస్ట్రేలియన్ ప్లేయర్.. బెంగళూరు జట్టుకు ఆడుతున్న హేజిల్ వుడ్ కూడా ఉన్నాడు. అయితే అతని పేరుట ఒక తప్పుడు సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. అతడు ఆస్ట్రేలియా ఆటగాడు అయినప్పటికీ.. ” మీరు చూపిస్తున్న ధైర్యం కేవలం భారతదేశానికి మాత్రమే కాదు.. సుస్థిరమైన ప్రపంచం కోసం” అని అర్థం వచ్చేలా హేజిల్ వుడ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఇండియా సైన్యానికి అనుకూలంగా.. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఉండడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. దీనిపై ఆస్ట్రేలియా మీడియాలో ప్రముఖంగా కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో హేజిల్ వుడ్ మీడియాకు అసలు ఏం జరిగిందో చెప్పారు. దీంతో ఒకసారి గా వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. వాస్తవానికి హేజిల్ వుడ్ ఎటువంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు. అంతేకాదు హేజిల్ వుడ్ కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు కూడా సపోర్టుగా నిలిచింది. ఆ తప్పుడు ఖాతాల నుంచి ఫేక్ ఇన్ఫర్మేషన్, పోస్టులను పర్మినెంట్ గా డిలీట్ చేయించింది. దీంతో హేజిల్ వుడ్ ఊపిరి పీల్చుకున్నాడు. అంతేకాదు వివాదానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టాడు.
Also Read : అందుకే పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరింది: సైనిక చరిత్రకారుడి సంచలన నిజాలు