Hardik Pandya : భారత టి20 జట్టులో స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు స్థిరమైన స్థానం ఉంది. వాస్తవానికి సూర్య కుమార్ యాదవ్ కంటే ముందు కొన్ని టోర్నీలలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హార్దిక్ పాండ్యా నే కెప్టెన్ అవుతాడని అందరు అనుకున్నారు. కానీ యాదృచ్చికంగా సూర్యకుమార్ యాదవ్ లైన్ లోకి వచ్చాడు. దీంతో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత హార్థిక్ పాండ్యా భారత వన్డే జట్టులో కనిపించలేదు. అయితే అతడు త్వరలోనే వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పిస్తోంది.. త్వరలో విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. ఆ ట్రోఫీ మొత్తం వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. దాని ద్వారా హార్దిక్ పాండ్యా వన్డే జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. అప్పటినుంచి వచ్చేఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ లో హార్థిక్ పాండ్యా ఆడతాడని తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. నాడు వన్డే వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు అతడు గాయపడ్డాడు. తర్వాత అతడు జట్టులో కనిపించలేదు. ఐపీఎల్ లో ముంబై జట్టుకు అతడు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ లో ఆడాడు. టీమిండియా వరల్డ్ కప్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన కొద్ది రోజులకు తన విడాకుల ప్రకటన చేశాడు. తన భార్య నటాషా తో విడిపోతున్నట్టు అతడు వెల్లడించాడు.
హార్దిక్ రాకతో..
హార్దిక్ పాండ్యా స్టార్ ఆల్ రౌండర్. బంతితో మాయ చేస్తాడు. బ్యాట్ తో ఆకట్టుకుంటాడు. ఫీల్డింగ్ లోనూ విన్యాసాలు చేస్తాడు. అయితే అతడు వన్డే జట్టులోకి రావడం టీమిడియాకు ఎనలేని లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. “టి20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. అతడికి వన్డే ఫార్మాట్ కొత్త కాదు. ఎలా అయినా ఆడతాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ లో టీం ఇండియాకు హార్దిక్ పాండ్యా అవసరం చాలా ఉంది. అందువల్లే అతడు జట్టులోకి రావాల్సిన సందర్భం కూడా ఉంది. విజయ్ హజారే ట్రోఫీ ద్వారా హార్థిక్ పాండ్యా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటాడు. ఆ తర్వాత తన సేవలను జట్టుకు అందిస్తాడు.. అది టీమిండియా కు ఎంతో లాభం చేకూర్చుతుందని..ఇందులో అనుమానం అవసరం లేదని” క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.