Hardik Pandya: గుజరాత్ జట్టు నుంచి అనూహ్యంగా ముంబై జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఎందుకు వచ్చాడు? కెప్టెన్ గా వచ్చిన తర్వాత తనకంటే ముందు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మతో మాట్లాడాడా? ఒకవేళ మాట్లాడితే రోహిత్ ఏమన్నాడు? దానికి హార్దిక్ ఏం బదులు చెప్పాడు? త్వరలో జరగబోయే 17వ సీజన్లో తన జట్టుకూర్పు ఎలా ఉంది? మేనేజ్మెంట్ ఎంతవరకు సహకరిస్తోంది? వంటి వాటిపై హార్దిక్ పాండ్యా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హార్దిక్ పాండ్యా తొలిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ” ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా నియామకమైన తర్వాత ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడలేదు. అయినప్పటికీ రోహిత్ శర్మ నుంచి నాకు కావాల్సినంత సహకారం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నా. ఎందుకంటే గత పది సంవత్సరాలుగా అతని సారథ్యంలో ఆడుతున్నాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై జట్టు యాజమాన్యం గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న నన్ను క్యాష్ ట్రేడ్ డీలింగ్ ద్వారా తీసుకుంది. తీసుకోవడమే కాకుండా కెప్టెన్ ను చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని యాజమాన్యం ప్రకటించింది. ఈ సీజన్ కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే శిక్షణ శిబిరంలో వారు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈసారి విజయం పట్ల సంపూర్ణ నమ్మకంతో ఉన్నాను. రోహిత్ శర్మతో ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడితే ఎలాంటి పదాలు ఉపయోగించాలో నాకు తెలుసు. కెప్టెన్సీ మార్పు గురించి ఎవరెవరో ఏదేదో అనుకుంటారు. వారందరికీ సమాధానం చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు అంటూ” హార్దిక్ ముగించాడు.
మరో వైపు కెప్టెన్సీ మార్పుతో ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే లక్షలాదిమంది అభిమానులు ముంబై ఇండియన్స్ జట్టు సోషల్ మీడియా ఖాతాను అన్ ఫాలో చేశారు.. హార్థిక్ పాండ్యా ను ట్యాగ్ చేస్తూ విమర్శలు చేశారు. అయితే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఆటగాళ్ల కోసం ట్రైనింగ్ సెషన్ నిర్వహిస్తోంది. దీనికి ఇంతవరకు రోహిత్ శర్మ హాజరు కాలేదు. రోహిత్ శర్మకు వెన్నునొప్పి కారణంగా అతడు ఈ ట్రైనింగ్ సెషన్లో పాల్గొనలేదని తెలుస్తోంది. ఒకవేళ ఆ నొప్పి తగ్గకపోతే అతను ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. అయితే తాను ఎందుకు ట్రైనింగ్ సెషన్ లోకి వెళ్లడం లేదో రోహిత్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదు. సోమవారం అతడు ట్రైనింగ్ కు వస్తాడని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఇటీవల ప్రకటించినట్లు తెలిసింది. అయినప్పటికీ అతడు సోమవారం ట్రైనింగ్ సెషన్ కు హాజరు కాలేదు.
“It won’t be any different because he will always be there to help me out if I need his help. At the same time, his (Rohit) being the Indian captain helps me because this team has achieved all its glory under his belt. From now on, it will just be me carrying forward what he…
— Mumbai Indians (@mipaltan) March 18, 2024