Hardik Pandya : వర్ధమాన ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి హార్దిక్ పాండ్యా తీవ్రంగా ప్రయత్నిస్తాడు. వాళ్లకు అవకాశాలు కల్పించడంలో తన వంతుగా సాయం చేస్తుంటాడు. ఎందుకంటే ఒకప్పుడు కూడా హార్దిక్ పాండ్యా ఇలా ఇబ్బంది పడ్డవాడే. అందువల్లే ప్రతిభ ఉన్న ఆటగాళ్లల్లో వారి నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి తన వంతుగా సహాయం చేస్తుంటాడు. హార్దిక్ పాండ్యా వల్ల ఎంతోమంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. దేశవాళీ, వివిధ క్రికెట్ టోర్నీలలో ఆడుతున్నారు. కేవలం పురుషులనే కాదు, మహిళా క్రికెటర్లను కూడా హార్దిక్ పాండ్యా ప్రోత్సహిస్తుంటాడు.. వారికి అవకాశాలు దక్కేలా చూస్తుంటాడు. అయితే ప్రతిభావంతులకు మాత్రమే హార్దిక్ పాండ్యా తన వంతు సహాయం అందిస్తుంటాడు . తాజాగా ఓ మహిళా క్రికెటర్ కు విలువైన బహుమతి ఇచ్చాడు.. ఆ మహిళా క్రికెటర్ కోరడంతో.. అతడు ఆ పని చేశాడు.
Also Read : ఆ నోబాల్ గనుక వేయకుంటే.. SRH పరిస్థితి మరో విధంగా ఉండేది..
1100 గ్రాముల బ్యాట్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జట్టు తరఫున ఆడింది కశ్వి గౌతం (Kashvee Goutham).. కశ్వి గౌతమ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జట్టు తరఫున ఆడింది. తొమ్మిది మ్యాచ్లలో 200 పరుగులు చేశారు. బౌలింగ్లో 11 వికెట్లు పడగొట్టింది. పంజాబ్లోని చండీగఢ్ ప్రాంతానికి చెందిన కేశ్వి కుడి చేతివాటం బ్యాటింగ్, కుడి చేతివాటం బౌలింగ్ చేయగలదు. గుజరాత్ జట్టులో ఆడిన కేశ్వి గౌతమ్.. తన మనసులో మాట బయట పెట్టింది..” నాకు హార్దిక్ పాండ్యాను కలవాలని ఉంది. అతడి చేతుల మీదుగా ఒక బ్యాట్ తీసుకోవాలని ఉంది. ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలని” వ్యాఖ్యానించింది. అయితే ఆ విషయం హార్దిక్ పాండ్యాకు తెలిసింది. దీంతో అతడు ఈ విషయాన్ని కేశ్వి గౌతమ్ కు తెలియజేసి.. తన వద్దకు రప్పించుకున్నాడు. ఆ తర్వాత ఎస్జీ కంపెనీకి చెందిన 1100 గ్రాముల బ్యాట్ ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు..” ఇప్పటికైనా నీ కోరిక నెరవేరిందా? ఇదిగో ఈ బ్యాట్ తీసుకో.. నీ కోరికను నెరవేర్చుకో.. గొప్పగా ఆడు.. మైదానంలో విజృంభించు.. అద్భుతంగా ఆడి మంచి పేరు తెచ్చుకో” అంటూ హార్దిక్ పాండ్యా ఆమెకు సూచించాడు. ఇక 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించాడు. ఆ సీజన్లో గుజరాత్ జట్టు ఐపిఎల్ ట్రోఫీని అందుకుంది. ఇక 2024 లోంచి ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో ముంబై జట్టు అంతగా ఆకట్టుకోలేదు. ఈ సీజన్లను అంతంత మాత్రమే ప్రదర్శన చేస్తోంది. ఇక ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Hardik Pandya gifted a specific 1100 grams bat to Kashvee Gautam after her request during the WPL. ❤️ pic.twitter.com/JgqHWiunPH
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2025