Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya Gujarat vs Mumbai Controversy: గుజరాత్ మీద ఉన్న ప్రేమ ముంబై మీద...

Hardik Pandya Gujarat vs Mumbai Controversy: గుజరాత్ మీద ఉన్న ప్రేమ ముంబై మీద లేదా.. హార్దిక్ ఇంత మోసగాడా

Hardik Pandya Gujarat vs Mumbai Controversy: 2022లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. సాధారణ ప్లేయర్లతో గుజరాత్ జట్టును హార్దిక్ పాండ్యా విజేతగా నిలిపాడు. 2023లో ఏకంగా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. దీంతో హార్థిక్ పాండ్యా ఒక్కసారిగా నేషన్ వైడ్ సెన్సేషన్ అయిపోయాడు. అతడి ఆట తీరు చూసి ముంబై ఇండియన్స్ యాజమాన్యం మై మరచిపోయింది. అతడిని ఏకంగా జట్టులోకి తీసుకుంది.

అప్పటిదాకా సారధిగా ఉన్న రోహిత్ శర్మను కూడా పక్కనపెట్టింది. ఐదు సార్లు విజేతగా నిలిపినప్పటికీ.. ఒక సాధారణ ఆటగాడిగా మార్చింది. ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ ముంబై యాజమాన్యం హార్దిక్ విషయంలో వెనక్కి తగ్గలేదు. చివరికి అభిమానులు మైదానంలో రెండు వర్గాలుగా విడిపోయి.. కొట్టుకున్నప్పటికీ ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యా ను నూటికి నూరు శాతం నమ్మింది.

హార్థిక్ పాండ్యా మాత్రం ఆ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు వమ్ము చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే 2024లో అతడు ముంబై జట్టుకు కెప్టెన్ గా వచ్చాడు. ఆ సీజన్లో ముంబై జట్టు ఏకంగా చివరి స్థానంలో నిలిచింది. ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అనామక జట్ల చేతులలో కూడా చేతులెత్తేసింది. 2025లో 4వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో మాత్రం ఏడు మ్యాచులలో.. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఏ జట్టుకు లేనంత స్థాయిలో స్టార్ ప్లేయర్లు ముంబై జట్టుకున్నారు. రోహిత్ శర్మ నుంచి సూర్యకుమార్ యాదవ్ దాకా.. హార్దిక్ పాండ్యా నుంచి బుమ్రా వరకు అద్భుతమైన ప్లేయర్లు ముంబై జట్టులో ఉన్నారు. అయినప్పటికీ ఆ జట్టు విజయాలు సాధించలేకపోతోంది. ఇటీవల కాలంలో జట్టు ప్రదర్శన పట్ల హార్దిక్ ఇదే స్థాయిలో విస్మయం వ్యక్తం చేశాడు. ఎక్కడ లోపం ఉందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

హార్దిక్ పాండ్యా జట్టులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామని.. కచ్చితంగా విజయాలు సాధిస్తామని చెప్పాడు. కానీ ఇంతవరకు ముంబైజట్టు ఆ దిశగా విజయాలు సాధించలేకపోతోంది. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 103 పరుగుల తేడాతో ఓడిపోయి పరువు తీసుకుంది. హార్థిక్ పాండ్యా నాయకత్వ లోపం జట్టు ఓటమికి కారణమని ముంబై అభిమానులు చెబుతున్నారు. హార్థిక్ పాండ్యాను పక్కనపెట్టి.. రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular