Jasprit Bumrah: ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీమ్ లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ టీంలోకి కొత్త కెప్టెన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.ఆల్రెడీ గుజరాత్ టైటాన్స్ టీం ని ఒకసారి విజేతగా నిలిపి రెండోసారి ఫైనల్ కి తీసుకెళ్లి ఒక్క అడుగు దూరంలో టైటిల్ ని మిస్ చేసుకున్న హార్దిక్ పాండ్యా ను ముంబై టీం లోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆ టీంలో కొంతమంది ప్లేయర్ల మధ్య తరచు వివాదాలు జరుగుతున్నట్టుగా కూడా ఆసక్తికరమైన వార్తలైతే బయటికి వస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే ఇండియన్ టీం ఫేస్ బౌలర్ అయిన జస్ప్రిత్ బుమ్ర కూడా ముంబై ఇండియన్స్ టీం పట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఆయన ఆ టీం తో కొన్ని విభేదాలను కూడా పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు బుమ్రా సోషల్ మీడియా లో తను పెట్టిన పోస్ట్ ఒకటి ముంబై ఇండియన్స్ టీం పట్ల తీవ్రమైన అసహనం లో ఉన్నాడు అనడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ గా కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే సరైన సమాధానం అనే కొటేషన్‌ను షేర్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అయితే ప్రస్తుతం ముంబై టీం లో ఫ్యూచర్ లో తను కెప్టెన్ గా ఎదుగుతాడని చాలా ఆశలు పెట్టుకున్న బుమ్ర…ముంబై ఇండియన్స్ టీమ్ హార్దిక్ పాండ్య ను తీసుకోవడంతో ఇక బుమ్ర ఆశల పైన నీళ్లు చల్లినట్టుగా అయింది. ఇక దాంతో తను ముంబై ఇండియన్స్ టీం నుంచి తను బయటికి వెళ్లిపోయి ఆర్సిబి టీం లో చేరుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇప్పటికే ఆర్ సి బి టీమ్ లో నుంచి జోస్ హజిల్ వుడ్ ను తీసేసింది అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక దాంతో బుమ్ర ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది అంటూ మరి కొంతమంది తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ హార్దిక్ పాండ్య ని టీం లోకి తీసుకోవడం వల్ల ఇన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇప్పటికే చాలామంది క్రికెట్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే ముంబై ఇండియన్స్ టీమ్ మాత్రం వీటిని పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తుంది…