Jabardasth : జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ వేరు. ఆ షోలో ఈ చిన్న మార్పు జరిగినా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. జబర్దస్త్ అంటే మనకు నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ ముందుగా గుర్తుకు వస్తారు. ఈ షో వేదికగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, మహేష్ , రచ్చ రవితో పాటు పలువురు స్టార్స్ గా ఎదిగారు. మంత్రి అయ్యాక రోజా బుల్లితెరను వదిలేశారు. అంతకు ముందే నాగబాబు ఇతర కారణాలతో జబర్దస్త్ వీడారు.
జబర్దస్త్ జడ్జెస్ గా వీరు ఏళ్ల తరబడి పనిచేశారు. హాస్య ప్రియులకు నవ్వుపూయించారు. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలై ఇంకా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. రోజా, నాగబాబు తర్వాత అనసూయ కూడా షో నుండి వెళ్ళిపోయింది. సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను సైతం జబర్దస్త్ కి దూరం అయ్యారు. ఇక జడ్జెస్ విషయానికి వస్తే… నాగబాబు స్థానంలో కొన్నాలు మను కొనసాగారు. అలీ కూడా ఆ సీట్లో కూర్చున్నారు. మను మాత్రమే కొన్నాళ్ల పాటు పని చేశారు.
ఆయన తప్పుకున్నాక కమెడియన్ కృష్ణ భగవాన్ వచ్చారు. కొన్నాళ్లుగా ఆయనే జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక రోజా స్థానంలోకి మీనా, ఆమని, ఇంద్రజ ఇలా పలువురు హీరోయిన్స్ వచ్చారు. ఎవరూ ఆమె స్థాయిలో సక్సెస్ కాలేదు. కొన్నాళ్లుగా నటి కుష్బూ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె స్థానంలోకి ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి వచ్చింది.
మహేశ్వరి పేరు చెబితే హీరో జేడీ చక్రవర్తితో చేసిన గులాబీ, దెయ్యం చిత్రాలు గుర్తుకు వస్తాయి. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ అప్పట్లో యూత్ ని ఊపేసింది. వర్మ తెరకెక్కించిన దెయ్యం కూడా సూపర్ హిట్. పెళ్లి, ప్రియరాగాలు వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. సడన్ గా ఆమె జబర్దస్త్ జడ్జి సీట్లో ప్రత్యక్షం అయ్యింది. 2000 తర్వాత మహేశ్వరి సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. మహేశ్వరి కొన్నాళ్లు కొనసాగుతారా లేక కేవలం కొన్ని వారాలకేనా? అనేది చూడాలి…