Homeక్రీడలుHarbhajan Singh- MS Dhoni: ధోనిపై హర్భజన్ సెటైరికల్ ట్వీట్.. అసలేంటి వీరి మధ్య గొడవ.?

Harbhajan Singh- MS Dhoni: ధోనిపై హర్భజన్ సెటైరికల్ ట్వీట్.. అసలేంటి వీరి మధ్య గొడవ.?

Harbhajan Singh- MS Dhoni: భారత క్రికెట్ లో అతి తక్కువ కాలంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు గడించిన వ్యక్తి మహేంద్రసింగ్ ధోని. 2007 టి20 వరల్డ్ కప్ భారత జట్టు గెలిచిన తర్వాత ఒక్కసారిగా మహేంద్ర సింగ్ ధోని పేరు మార్మోగిపోయింది. వరల్డ్ కప్ విజయం వెనక ఎంతోమంది ప్లేయర్ల కృషి దాగి ఉన్నప్పటికీ.. ధోనీకి మాత్రమే పేరు వచ్చింది. ఈ భావన చాలా మంది క్రికెటర్లలో ఉన్నప్పటికీ ఎవరూ బయటపడలేదు. తాజాగా నాటి జట్టులో సభ్యుడుగా ఉన్న హర్భజన్ సింగ్ ఈ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత జట్టు 2007లో టి20 వరల్డ్ కప్ సాధించింది. సుదీర్ఘ కాలం తర్వాత భారత జట్టు ఐసీసీ ట్రోఫీ నెగ్గినట్లు అయింది. దీంతో ధోనీకి మంచి పేరు వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ధోని వల్ల మాత్రమే వరల్డ్ కప్ వచ్చిందన్నంతగా పేరు మార్మోగిపోయింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి జట్టుకు గొప్ప విజయాలను అందించి, వరల్డ్ కప్ సాధించడం వెనుక ఎంతో మంది ప్లేయర్ల కృషి దాగి ఉన్నప్పటికీ వారికి ఆశించిన స్థాయిలో పేరు ప్రఖ్యాతలు దక్కలేదు. ఒక్క ధోనీకి మాత్రమే వరల్డ్ కప్ క్రెడిట్ మొత్తం వెళ్ళిపోయింది. దీంతో నాటి వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో ఉన్న ఎంతో మంది ఆటగాళ్లు ఆవేదన మనసులోనే దాచుకున్నారు. తాజాగా నాటి జట్టులో సభ్యుడిగా ఉన్న హర్భజన్ సింగ్ ధోని టార్గెట్ గా సెటైరికల్ ట్వీట్ చేసి.. తమ మనసులోని ఉన్న ఆవేదనను బయటకు వ్యక్తం చేశారు.

హార్భజన్ సింగ్ ఏం ట్వీట్ చేశాడంటే..?

ట్విట్టర్ వేదికగా టి20 వరల్డ్ కప్ విన్నింగ్ గురించి స్పందించిన హర్భజన్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ ను ధోని యంగ్ ప్లేయర్లతోనే గెలిపించాడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై హర్భజన్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘అవును.. అతనొక్కడే ఒంటరిగా ఆడాడు. మిగతా పదిమంది ఆడలేదు. ఆస్ట్రేలియా లేదా మరి ఏదైనా దేశం ప్రపంచ కప్ గెలిస్తే ఆ టీమ్ మొత్తం గెలిచిందని అంటారు. కానీ, ఇండియాలో కెప్టెన్ ఒక్కడే గెలిపించినట్లు చెబుతారు. ఇది ఒక టీమ్ గేమ్. ప్లేయర్లు కలిసి గెలుస్తారు. కలిసి ఓడతారు’ అని హర్భజన్ సింగ్ ఆ నెటిజన్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ ట్వీట్ చేశాడు.

కీలక ఆటగాళ్లలో ఇదే ఆవేదన..

ఒక్క హర్భజన్ సింగ్ కే కాకుండా నాటి వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న అందరిలోనూ ఇదే విధమైన అభిప్రాయం ఉంది. కాకపోతే ఎవరు దానిని బయట పెట్టడం లేదు. యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, దినేష్ కార్తీక్, యూసఫ్ పఠాన్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఎంతో మంది ప్లేయర్లు కీలక ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు వరల్డ్ కప్ అందించి పెట్టారు. అయితే, వారెవరికి ఆ స్థాయిలో పేరు రాలేదు. కెప్టెన్ గా ధోని ఉండడంతో వరల్డ్ కప్ ధోని మాత్రమే తెచ్చాడు అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో వరల్డ్ కప్ జట్టులో ఉన్న సభ్యులుగా ఉన్న ఎంతో మందిలో ఒక రకమైన ఆవేదన నెలకొంది. ఆ ఆవేదన నుంచి వచ్చిన రిప్లైగా దీన్ని చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular