Rajinikanth- Tamannaah: తమన్నా కెరీర్లో మొదటిసారి రజినీకాంత్ తో జతకడుతుంది. రజినీకాంత్-తమన్నా కాంబినేషన్ లో జైలర్ మూవీ తెరకెక్కుతుంది. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 10న జైలర్ విడుదల కానుంది. కరుడుగట్టిన నేరస్తులు ఉండే జైలుకు జైలర్ గా రజినీకాంత్ కనిపించనున్నారు. రజినీకాంత్ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయట. కాగా తన సహ నటి తమన్నాకు రజినీకాంత్ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడట. ఈ న్యూస్ పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.
రజినీకాంత్ కి దైవభక్తి ఎక్కువ. ఆయన రాఘవేంద్ర స్వామి భక్తుడు. అలాగే హిమాలయాల్లో ఉన్న ఓ బాబాజీని అమితంగా ఆరాధిస్తారు. మన జీవితంలో జరిగే ప్రతి చర్యకు దేవుడే కారణమని నమ్ముతాడు. ఇక తన తోటి నటులకు దేవుడు గురించి విషయాలు చెబుతాడు. వారిలో ఆధ్యాత్మిక చింతన పెరిగేలా చేస్తాడు. ఈ క్రమంలో జైలర్ హీరోయిన్ తమన్నాకు రజినీకాంత్ చిన్న గిఫ్ట్ ఇచ్చాడట. రాఘవేంద్ర స్వామి విగ్రహాన్ని, ఓ పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడట.
రజినీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ కి తమన్నా మురిసిపోతున్నారట. ఇక రోజు వ్యవధిలో తమన్నా నటించిన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఒకటి జైలర్ కాగా మరొకటి భోళా శంకర్. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. తమిళ్ హిట్ మూవీ వేదలమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ సైతం నటిస్తున్నారు. ఆమెది చెల్లెలు పాత్ర. వాల్తేరు వీరయ్య మూవీ విజయంతో జోరుమీదున్న చిరంజీవి నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.
మరోవైపు తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. తరచుగా ఈ జంట కలిసి చక్కర్లు కొడుతున్నారు. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా, విజయ్ వర్మ నటించడం విశేషం. తమన్నా ఈ వార్తలను ఖండిస్తున్నారు. నేను ఎవరిని ప్రేమించడం లేదు. నా స్టేటస్ సింగిల్ అంటూ చెప్పుకొస్తున్నారు. బాలీవుడ్ వర్గాలు మాత్రం ఏదో ఒక రోజు తమన్నా బాంబు పేల్చుతుందని అంటున్నారు.