Happy Birthday Virat Kohli: ఆధునిక టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో అద్భుతమైన రికార్డులు సాధించాడు విరాట్ కోహ్లీ. సచిన్ తర్వాత క్రికెట్ కు ఆ స్థాయి ఆదరణ తీసుకొచ్చాడు. సచిన్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు కొన్ని సందర్భాలలో.. ఇంకా సచిన్ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర కూడా సృష్టించాడు. నేటితో 37వ సంవత్సరంలోకి విరాట్ కోహ్లీ అడుగుపెడుతున్నాడు.ఈ నేపథ్యంలో అతడు సాధించిన రికార్డుల గురించి ఒకసారి పరిశీలిస్తే.. టీమిండియాలో పరుగుల యంత్రంగా పేరు పొందాడు విరాట్ కోహ్లీ. క్రికెట్లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.. మరెన్నో హిస్టరీలను సృష్టించాడు.
వన్డేలలో 51 సెంచరీలు
వన్డేలలో విరాట్ కోహ్లీ 51 సెంచరీలు చేశాడు.. అత్యధిక శతకాల రికార్డును సొంతం చేసుకున్నాడు.. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బద్దలు కొట్టారు.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 27,000 పరుగుల మైలురాయిని విరాట్ కోహ్లీ దాటేశాడు.. ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడు విరాట్ కోహ్లీ.. టి20, టెస్ట్, వన్డే, ఫార్మాట్లలో 594 ఇన్నింగ్స్ లు ఆడిన విరాట్.. పై ఘనత అందుకున్నాడు.. అయితే ఈ ఘనత అందుకోవడానికి సచిన్ టెండూల్కర్ కు 623 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి.
వన్డేలలో వేగంగా పదివేల పరుగులు
విరాట్ కోహ్లీ వన్డేలలో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. 205 ఇన్నింగ్స్ లలోనే విరాట్ కోహ్లీ ఈ రికార్డు సృష్టించాడు.. విరాట్ కోహ్లీ ఫాస్టెస్ట్ 8000, 9000, 11000, 12000, 13000, 14000 రన్స్ రికార్డులను కూడా విరాట్ సొంతం చేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో ఏకంగా ఐదు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.. ఒక ప్రపంచ కప్ ఎడిషన్లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2023 వరల్డ్ కప్ లో 765 రన్స్ చేసి అదరగొట్టాడు. ఐపీఎల్ లో కూడా ఒక సీజన్లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. బెంగళూరు జట్టు తరఫున 2016 ఎడిషన్ లో 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 8000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.