Gujarat Titans vs Mumbai Indians : ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డింగ్ విషయంలో అత్యంత అత్యంత నాసిరకమైన తీరును ప్రదర్శించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ కు సంబంధించి రెండు విలువైన క్యాచ్ లను నేలపాలు చేసింది. అలాగే సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ లను సైతం జార విడిచింది. అలా వచ్చిన అవకాశాలను వారిద్దరు బీభత్సంగా సద్వినియోగం చేసుకున్నారు. రోహిత్ అయితే ఏకంగా 81 పరుగులు చేసి ముంబై జట్టుకు తిరుగులేని స్కోర్ అందించాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో ముంబై జట్టు స్కోర్ రాకెట్ వేగంతో వెళ్లిపోయింది.. కోయేట్జీ వేసిన చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా 20 పరుగులు పిండుకున్నాడు. ఒత్తిడిలో ఆ బౌలర్ రెండు వైడ్లు కూడా వేశాడు. మొత్తంగా ఆ ఓవర్ లో 22 పరుగులు వచ్చాయి. తద్వారా ముంబై జట్టు స్కోరు 228 పరుగులకు చేరుకుంది. ఈ చివరి ఓవర్ కోయేట్జీ కాకుండా.. మరో బౌలర్ కు ఇచ్చి ఉన్నా పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. గిల్ చేసిన ఈ తప్పు గుజరాత్ ఎదుట భారీ టార్గెట్ ను ఉంచింది.
229 పరుగులు చేయాల్సిన తరుణంలో ఓపెనర్ గిల్ ఒక్క పరుగు మాత్రమే చేసి బౌల్ట్ బౌలింగ్లో అవుట్ అవ్వడం గుజరాత్ అభిమానులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.. ఇక జట్టు ఇన్నింగ్స్ కుదురుకుంటున్న సమయంలో కుశాల్ మెండీస్ హిట్ వికెట్ గా వెను తిరగడం గుజరాత్ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ఈ దశలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ ముందు.. బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కావడం మ్యాచ్ స్వరూపాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. 80 పరుగులు చేసి జోరు మీద ఉన్న సాయి సుదర్శన్ అనవసరమైన షాట్ కు యత్నించి రిచర్డ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కావడంతో గుజరాత్ జట్టును కోలు కోలేని దెబ్బతీసింది.
Also Read : రోహిత్ సూచన పాటించిన హార్దిక్.. కట్ చేస్తే మూడు వికెట్లు..
ఇక చివరి ఓవర్ ను అశ్విని కుమార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.. సాయి సుదర్శన్ క్రీజ్ లో ఉన్నంతసేపు హార్దిక్ పాండ్యా విపరీతమైన ఒత్తిడితో ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న రోహిత్ శర్మ అయితే తలబాదుకున్నాడు. సాయి సుదర్శన్, సుందర్ ఉన్నంత సేపు శుభ్ మన్ గిల్ సేనదే పై చేయి లాగా కనిపించింది. కానీ ఎప్పుడైతే బుమ్రా బంతి అందుకున్నాడో అప్పుడే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. అది గుజరాత్ జట్టుకు ఊహించని ఓటమిని అందించింది. ఆ జట్టు అభిమానులకు కన్నీళ్లను మిగిలించింది.