The Traitors : మన ఇండియా లో రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ వేరు. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఈ రియాలిటీ షోస్ కి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ ఉంటారు. మన తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఏకైక రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మాత్రమే. కానీ బాలీవుడ్ మేకర్స్ మనకంటే ఒక అడుగు ముందు ఉంటారు. ఇప్పటికే ఎన్నో రకాల రియాలిటీ షోస్ ని వాళ్ళు అక్కడి ఆడియన్స్ కి పరిచయం చేశారు. ఇప్పుడు ‘ది ట్రైటర్స్'(The Traitors) అనే రియాలిటీ గేమ్ షో తో మన ముందుకు రాబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ(Amazon Prime Video) ఈ గేమ్ షో ని జూన్ 12 నుండి స్ట్రీమింగ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఇందులో మన తెలుగు నుండి మంచు లక్ష్మీ (Manchu Lakshmi) కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొనడం విశేషం.
ప్రతీ గురువారం రాత్రి 8 గంటలకు సరికొత్త ఎపిసోడ్స్ అందుబాటులోకి వస్తాయట. ఎన్నో దేశాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ రియాలిటీ షోని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు. బాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా లో పాపులారిటీ ని సంపాదించిన సెలబ్రిటీస్ ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ గేమ్ షోలో పాల్గొనబోతున్నారు. మొత్తం మీద 20 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ గేమ్ షో లో ఊహించని మలుపులు ఎన్నో ఉంటాయి. అంతే కాకుండ హై వోల్టేజ్ డ్రామా తో పాటు ఉత్కంఠభరితమైన, సాహసోపేతమైన గేమ్స్ ఎన్నో ఇందులో ఉంటాయి. ఈ షోని రాజస్థాన్ లోని సూర్య గఢ్ ప్యాలస్ లో నిర్వహించబోతున్నారు. ఈ రియాలిటీ షో లో గెలిచినా వారికి భారీ స్టాయిప్ నగదు బహుమతి లభిస్తుంది.
ఇన్ని రోజులు మన టీవీ షోస్ లో న్యాయ నిర్ణేతగా కనిపించిన మంచు లక్ష్మీ, ఈసారి కంటెస్టెంట్ గా కనిపించబోతుంది. మన తెలుగు ఆడియన్స్ కేవలం ఈమె ఎలా ఆడుతుంది అనే దానికోసమేనా కచ్చితంగా ఈ షోని చూస్తారు. మంచు లక్ష్మీ డబ్బుల కోసం అయితే ఈ షో కి కచ్చితంగా వచ్చి ఉండదు. ఆమెకి లేని డబ్బులా?, ఆమెకి లేని ఆస్తులా?..కేవలం సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతి కోసమే ఆమె ఈ షోలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్స్ ని బాగా తొక్కేస్తారు అనే వాదనని నిజం చేస్తూ మంచు లక్ష్మీ కి సంబంధించిన షాట్స్ కేవలం కొన్ని మాత్రమే పెట్టారు. ఇది కాస్త మన ఆడియన్స్ ని ఇబ్బందికి గురి చేసింది.