Ranji Trophy: కానీ అప్పుడప్పుడు కొన్ని రంజి మ్యాచులు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంటాయి. చివరికి చూసే వాళ్లకు అద్భుతమైన క్రికెట్ మజాను అందిస్తుంటాయి. అలాంటిదే కేరళ , గుజరాత్ జట్ల మధ్య రంజిత్ రఫీ మ్యాచ్ ఒకటి జరిగింది.. రంజీ ట్రోఫీ సెమి ఫైనల్ మ్యాచ్ లో భాగంగా కేరళ, గుజరాత్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ రెండు జట్లు ఫైనల్ వెళ్లాలంటే కచ్చితంగా విజయం సాధించాలి. అయితే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడంతో చివరి వరకు ఉత్కంఠ కలిగించింది. గుజరాత్ ముందడుగు వేయడానికి రెండు పరుగులు అవసరం కాగా.. కేరళ ఫైనల్ చేరుకోవడానికి ఒక్క వికెట్ అవసరం పడింది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనేక మలుపులు తిరగడంతో పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో హెల్మెట్ కీలకపాత్ర పోషించింది.. ఫలితంగా చూసే వాళ్లకు అసలు సిసలైన క్రికెట్ మజా లభించింది.
అక్కడ మలుపు తిరిగింది
అప్పటిదాకా గుజరాత్ ఆటగాడు అర్జున్ నగ్వాస్ వాలా(10) నిదానంగా ఆడుతున్నాడు. రెండు పరుగులు తేలిగ్గా కొట్టొచ్చని గట్టిగా షాట్ కొట్టాడు. అయితే అతడు కొట్టిన బంతి గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్ ను బలంగా తగిలింది. అదే ఆ బంతి అలా గాల్లోకి ఎగరడంతో మొదటి స్లిప్ లో ఉన్న కేరళ కెప్టెన్ సచిన్ బేబీ అద్భుతంగా స్పందించాడు. బంతిని తన రెండు చేతులతో పట్టుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటర్ అర్జాన్ షాక్ కు గురయ్యాడు. తొలిసారిగా రంజీలో ఫైనల్ వెళ్లడంతో కేరళ జట్టు ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. అనుకోకుండా ఎదురైన ఓటమితో గుజరాత్ జట్టులో నిరాశ అలముకుంది. అయితే డ్రా గా ముగిసిన సెమీఫైనల్ మ్యాచ్లో.. రెండు పరుగుల సల్ప తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా కేరళ ఫైనల్ వెళ్ళింది.
తొలిసారిగా ఫైనల్ కు..
కేరళ జట్టు 1957 లో తొలిసారిగా రంజి ఆడింది. 2018-19 కాలంలో సెమీస్ వెళ్ళింది. గొప్పగా ఆడిన గుజరాత్ ఫైనల్ వెళ్తుందని అందరూ భావించారు. అయితే ఆ జట్టు ఆశలపై స్పిన్ బౌలర్ ఆదిత్య సర్వాటే (4/111) నీళ్లు చల్లాడు. మరో 29 పరుగులు చేస్తే ఫైనల్ వెళ్లే స్థితిలో ఉన్న గుజరాత్ జట్టు.. ఓవర్ నైట్ స్కోర్ 420/7 తో ఐదు రోజు ఉదయం రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 174.4 ఓవర్లలో 450 పలుకులకు ఆల్ అవుట్ అయింది. గురువారం 36.4 ఓవర్లు ఆడి.. 72 పరుగులు జోడించి గుజరాత్ గట్టును ఫైనల్ రేసులో నిలిపిన బ్యాటర్లు జయమీత్ పటేల్ (79), సిద్ధార్థ దేశాయ్ (30) ఐదో రోజు ఆటలో 10 పరుగుల స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుట్ అయ్యారు. సర్వాటే వీరిద్దరిని అవుట్ చేశాడు. ఆ సమయంలో కేరళ స్కోరును సమం చేయడానికి గుజరాత్ కు 11 పరుగులు అవసరమయ్యాయి. కేరళ జట్టుకు ఒక వికెట్ కావాల్సి వచ్చింది. ఆ దశలో అర్జాన్ , ప్రియ జీత్ సింగ్ జడేజా (3*) 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. కేరళ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. పది ఓవర్లపాటి వాడిన వారిద్దరు తొమ్మిది పరులు చేశారు. ఇంకా రెండు పరుగులు చేయాల్సిన సందర్భంలో అర్జాన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం 1/101 తో బౌలింగ్ మొదలు పెట్టిన సర్వాటే.. కొద్దిసేపటికి 111/4 గణాంకాలను నమోదు చేశాడు. గుజరాత్ జట్టు చివరి మూడు వికెట్లను సర్వాటే పడగొట్టాడు. స్పిన్నర్ జలజ్ సక్సేనా ఏకంగా 71 ఓవర్లు ఈ మ్యాచ్లో వేయడం విశేషం. అయితే అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక కేరళ రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అనంతరం రెండు జట్ల కెప్టెన్లు డ్రా కు అంగీకరించారు. ఇప్పటికి కేరళ రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టి 46 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి.. నాలుగు వికెట్లు కోల్పోయి 114 రన్స్ చేసింది. కేరళ తొలి ఇన్నింగ్స్ లో 457 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఇక ఈనెల 26 నుంచి మార్చి రెండు వరకు నాగ్ పూర్ లో కేరళ, విదర్భ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
View this post on Instagram