spot_img
Homeక్రీడలుక్రికెట్‌Gujarat Titans: ఆ నలుగురే బలం.. గుజరాత్..ఐపీఎల్ గెలిచేలా ఉందే..

Gujarat Titans: ఆ నలుగురే బలం.. గుజరాత్..ఐపీఎల్ గెలిచేలా ఉందే..

Gujarat Titans: హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంవత్సరంలోనే ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత సంవత్సరంలో రన్నరప్ గా నిలిచింది. మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన ఆ జట్టు నుంచి లభించలేదు. ఇప్పుడు గుజరాత్ అదరగొడుతోంది. ఈ సీజన్ లో వరుసగా ఓటములు ఎదుర్కొన్న ఆ జట్టు తన రాతను పూర్తిగా మార్చేసుకుంది.

అండర్ డాగ్స్ గా..

అండర్ డాగ్స్ గా అడుగుపెట్టిన గుజరాత్.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నెంబర్ 2 స్థానంలో ఉంది. చివరి మ్యాచ్ లో చైన్నై పై 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా +0.695 నెట్ రన్ రేట్ కొనసాగిస్తోంది. తొలిమ్యాచ్ పంజాబ్ చేతిలో ఓడిపోయింది.రాజస్థాన్ రాయల్స్ చేతిలో కూడా ఓటమిపాలైంది. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ గెలిచిన తర్వాత గుజరాత్ ఆటతీరు మారిపోయింది. వరుసగా మూడు విజయాలు సాధించింది. ముంబై, బెంగళూరు చేతిలో వరుసగా ఓడిపోయిన తర్వాత గుజరాత్ మళ్లీ విజయయాత్రను మొదలు పెట్టింది. వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఇందులో హైదరాబాద్ జట్టు పై కూడా గుజరాత్ విజయం సాధించింది.

ఆ నలుగురు

గుజరాత్ విజయంలో కెప్టెన్ శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, ప్రసిద్ధ్ క్రిష్ణ, రషీద్ ఖాన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సాయి సుదర్శన్ 638 పరుగులు చేసి, ఆరేంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. గిల్ 616 పరుగులతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. రషీద్ ఖాన్ 19, ప్రసిద్ధ్ క్రిష్ణ 14 వికెట్లతో పర్పుల్ క్యాప్ విభాగంలో తమసత్తా చాటుతున్నారు. ఇద్దరు బౌలింగ్ లో.. మరో ఇద్దరు బ్యాటింగ్ లో అదరగొడుతున్న నేపథ్యంలో గుజరాత్ జట్టుకు తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికైతే రెండోస్థానంలో ఉంది గుజరాత్. శుక్రవారం నాటి మ్యాచ్ లో బెంగళూరుపై హైదరాబాద్ గెలిస్తే GT స్థానం ఏమైనా మారొచ్చు.

గుజరాత్ భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో ఈసారి ట్రోఫీసాధించే అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గిల్ నాయకత్వంలో గుజరాత్ జట్టు వరుస విజయాలు సాధిస్తోందని, ఫినిక్స్ పక్షి లాగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గుజరాత్ బౌలింగ్, బ్యాటింగ్ లో ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈసారి ట్రోఫీ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Oktelugu Epaper